నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా

-చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ మే 4:

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని భీమారం మండలంలోని బూరుగుపల్లి, నర్సింగాపూర్, కాజుపల్లి, గ్రామాల్లో ఇటీవలే కురిసిన వర్షాలకు పంట నష్ట పరిసర ప్రాంతాలను ఆదివారం చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి పరిశీలించి నష్టపోయిన కుటుంబాలను పరామర్శించారు. అనంతరం చెన్నూర్ మండలంలోనీ ఒత్కుల పల్లె గ్రామంలో 3కోట్ల 55 లక్షల రూపాయల నిధులతో బీటీ రోడ్డు, వంతెనకు దుబ్బపల్లె గ్రామంలో 3 కోట్ల రూపాయల నిధులతో జెడ్పీ రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చెన్నూర్ నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు సాగుతున్నాయన్నారు. చెన్నూర్ నియోజకవర్గాన్ని గత ప్రభుత్వం అభివృద్ధి చేయకుండా వదిలేసిందన్నారు. నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు రోడ్లు వేసి కనెక్టివిటీనీ కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సన్న వడ్లకు 500 బోనస్ ను ప్రతీ ఒక్క రైతు ఖాతాలో వేసిందన్నారు. ప్రతీ ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి 500ల రూపాయల సబ్సిడీని అందిస్తుందన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని చెప్పి మోసం చేసిందని దుయ్య బట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఇచ్చిన మాట ప్రకారం ఇల్లు మంజూరు చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు డబుల్ వెరిఫికేషన్ చేసిన తరువాతనే మంజూరు చేయడం జరుగుతుందన్నారు. గ్యాస్ సబ్సిడీ రాని వారు స్థానిక నాయకులను కలిసి లింక్ చేసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో స్థానిక నాయకులు అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking