పాకిస్తాన్‌ ప్రజలను తిరిగి పంపించేయాలి

కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు చొరవ చూపాలి
కాంగ్రెస్‌ ప్రభుత్వాల తీరు సిగ్గుచేటు
బిజెపి నేత ఉమా మహేందర్‌
గోషామహల్‌ ప్రజాబలం ప్రతినిధి: పాకిస్తాన్‌ పౌరుల మీసాలు రద్దు చేసి వారిని వారి దేశానికి పంపించేందుకు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు చొరవ చూపడం లేదని బిజెపి గోల్కొండ జిల్లా అధ్యక్షులు ఉమా మహేందర్‌ విమర్శించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఉన్న పాకిస్తాన్‌ పౌరుల వీసాలు రద్దుచేసి వారిని తిరిగి పంపించేందుకు చర్యలు తీసుకుంటుంటే, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు మాత్రం చొరవ చూపడం లేదని ఉమా మహేందర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాల తీరుకు నిరసనగా ఆదివారం నాడు హైదరాబాద్‌ పాతబస్తీలోని చార్మినార్‌ నుంచి గుల్జార్‌ హౌస్‌ వరకు బిజెపి ఆధ్వర్యంలో నిరసన మార్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి గోల్కొండ జిల్లా అధ్యక్షులు ఉమ మహేందర్‌ మాట్లాడుతూ తెలంగాణ కర్ణాటక వంటి కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు కూడా పాకిస్తాన్‌ పౌరుల వీసాలు రద్దుచేసి వెంటనే వారిని తిరిగి పంపించేయాలని ఉమా మహేందర్‌ డిమాండ్‌ చేశారు. లీగల్‌ గా ఇల్లీగల్‌ గా ఉన్న వారందరిని తిరిగి వారి దేశానికి పంపించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వాలు చొరచూపాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో తెలంగాణ కర్ణాటక ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు. దేశభద్రత నేపథ్యంలో కేంద్రంలోని బిజెపి సర్కార్‌ తీసుకున్న నిర్ణయాన్ని అన్ని రాష్ట్రాలు స్వాగతిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు అమలు చేయకపోవడం శోచనీయమని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌ ప్రభుత్వాలు తమ తీరు మార్చుకొని దేశభద్రతకు పాటుపడేలా వివరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జాంబాగ్‌ డివిజన్‌ కార్పోరేటర్‌ రాఖేష్‌ జైస్వాల్‌ ,గోషామహల్‌ డివిజన్‌ కార్పోరేటర్‌ లాల్‌సింగ్‌ ,నటరాజ్‌ నాందారి, దేవాజోషి, వెంకటేష్‌గౌడ్‌ ,నరహరి, సురేందర్‌ ,కునాల్‌రావ్‌, దీపక్‌, అమర్‌సింగ్‌, గోల్కోండ జిల్లా బీజేపీనాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking