👉కొనుగోలు కేంద్రాల పరిశీలనలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ నియోజకవర్గం ప్రతినిధి మే4(ప్రజాబలం)మెదక్ జిల్లా:హవేలీ ఘనాపూర్/కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని త్వరితగతిన తరలించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు.,హవేలీ ఘనాపూర్ మండలంలోని కుచాన్ పల్లి గ్రామంలో ఉన్న కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం పరిశీలించారు,ముందుగా రీజిస్టర్లు పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు రైతులతో మాట్లాడటంతో పాటు కొనుగోలు ప్రక్రియ, రైతులకు అందిస్తున్న సేవలు, ఇతర సౌకర్యాలు, సేవలపై ఆరా తీశారు. ప్రధానంగా రైతులకు అందుతున్న మద్దతుపై అడిగి తెలుసుకున్నారు. . కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని జాగ్రత్తగా తడవకుండా కింద, పైన టార్పలిన్ కప్పాలనినిర్వాహకులకు సూచించారు. లారీల కొరత లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. రైతులు తమ పంటలను సులభంగా విక్రయించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకోవాలని తెలిపారు..రైస్ మిల్లర్లు ధాన్యాన్ని త్వరగా దించుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో కొనుగోలు కేంద్ర నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.