👉కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్య సిబ్బందిని ఆదేశించారు
మెదక్ నియోజకవర్గం ప్రతినిధి మే 4(ప్రజాబలం)మెదక్ జిల్లా:మెదక్/ఆదివారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మెదక్ జిల్లా కేంద్రంలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు,ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై ఆకస్మిక తనిఖీ చేపట్టారు.ఈ నేపథ్యంలో వైద్యులు, సిబ్బంది హాజరు రిజిస్టర్లను, ఓపీ రిజిస్టర్ లను, ఔషధాల నిల్వల రిజిస్టర్ లను తనిఖీ చేశారు. అలాగే వైద్య సిబ్బందితో మాట్లాడి, రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.ప్రజల వైద్య సేవల నిమిత్తం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వస్తారని ప్రజలకు వైద్యులు, నర్సులు ప్రతిరోజూ అందుబాటులో ఉండాలని సూచించారు.ప్రజారోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వేసవి దృష్ట్యా దవాఖానాలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు సరిపడా అందుబాటులో ఉంచాలన్నారు.సాధారణ ప్రసవాలను మరింతగా పెంచాలని, ఆరోగ్య కేంద్రంలో, అలాగే పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజలు వడదెబ్బకు గురికాకుండా విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు,ఈ పరిశీలనలో వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
