👉పెండింగ్ లో ఉన్న నాలుగు నెలల వేతనం విడుదల చేయాలి
👉సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీకి వినతి
నాగర్ కర్నూల్ ప్రతినిధి మే 4(ప్రజాబలం)నాగర్ కర్నూల్ జిల్లా:నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 436 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత 12 సంవత్సరాలుగా 1654 మంది అతిధి అధ్యాపకులుగా పనిచేస్తున్నారని తక్షణమే వారికీ ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్ లో ఉన్న నాలుగు నెలల వేతనాన్ని విడుదల చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అతిధి అధ్యపక సంఘం నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షులు కావలి కృష్ణ ఆదివారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారికి విన్నవించారు. అనంతరం నాగర్ కర్నూల్ శాసనసభ్యులు కూచుకుల రాజేష్ రెడ్డి గారికి వివిధ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ అధ్యాపకుల సమస్యల్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా అన్నారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సానుకూలంగా స్పందించి వారు మాట్లాడుతూ మీ సమస్యలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, మీకు న్యాయం జరిగేలా చూస్తానని అన్నారు. అనంతరం అతిథి ఆధ్యాపక సంఘం జిల్లా అధ్యక్షులు కావలి కృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గ్రామీణ పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చాలీ చాలని వేతనాలతో పనిచేస్తూ ఇతర ఉద్యోగులతో సరిసమానంగా మేము కూడా పని చేస్తున్నప్పటికి డిసెంబర్ నుంచి మార్చి వరకు వేతనాలు పెండింగ్లో ఉన్నాయి,వాటిని వెంటనే విడుదల చేస్తూ మరియు రెగ్యులర్ అధ్యాపకుల వల్ల డిస్టర్బ్ అయిన అతిథి అధ్యాపకులకు ఆడ్జస్ట్మెంట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మొన్న విడుదలైనా ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉన్నత ఫలితాలను సాధించేందుకు సాధారణ విద్యార్థుల సైతం అద్భుత ఫలితాలు సాధించేందుకు అహర్నిశలుగా శ్రమించామని అన్నారు. అతిధి అధ్యాపకుల బ్రతుకులు అధ్వానంగా మారాయని, కుటుంబాన్ని పోషించుకోలేక, ఉద్యోగం ఉంటుందో పోతుందో, అనే సందిగ్ధంలో సతమతమవుతూ అరచేతుల్లో ప్రాణాన్ని పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ దినసరి కూలీలుగా కాలం వెళ్ళదీయాల్సిన దీన దుస్థితి తలచిందన్నారు.ప్రధానంగా ప్రస్తుతం మమ్మల్ని వెంటాడుతున్న రెండు సమస్యలు తక్షణమే పరిష్కరించగలరు. అధ్యాపకుల నియామకము తో డిస్టర్స్ అయ్యే వారిని సీనియారిటీ ప్రకారము మల్టీ జోనల్ ప్రకారం అడ్జస్ట్మెంట్ చేయడం.డిసెంబర్ నుంచి మార్చి వరకు పెండింగ్లో వున్న 04 నెలల వేతనాలు వెంటనే విడుదల చేయాలి.ఇప్పటికైనా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న 1654 మంది అతిధి ఆధ్యాపకులను యధావిధిగా కొనసాగింపు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు,ఈ కార్యక్రమంలో అతిథి అధ్యాపక సంఘం జిల్లా అధ్యక్షులు కావలి కృష్ణ, ఐదో మహిళా సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందికొండ గీత తదితరులు పాల్గొన్నారు.