ఎస్ ఆర్ డి పి, మెట్రో, వాటర్ వర్క్స్ హెరిటేజ్ పనుల పరిశీలన చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణరావు
హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి మే 04: నగరంలో ఎస్.ఆర్.డి.పి ఇతర శాఖల ద్వారా చేపట్టిన పనులను ఆదివారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణరావు పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ముందుగా చీఫ్ సెక్రెటరీ బంజారాహిల్స్ లో జివికె మాల్ వద్ద సుమారు రూ. 5 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిని పరిశీలించారు.
తదనంతర దారుషిఫా వద్ద మెట్రో లైన్ అలైన్మెంట్ (ఓల్డ్ సిటీ కారిడార్) పరిశీలించారు. ఓల్డ్ కారిడార్ ఎంజిబిఎస్ బస్ స్టేషన్ నుండి చాంద్రాయణగుట్ట వరకు చేపట్టే మెట్రో లైన్ పనుల గుర్తించి మెట్రోలైన్ ఎండి ఎన్విఎస్ రెడ్డి చీఫ్ సెక్రెటరీ కి వివరించారు. భూసేకరణ పక్రియ వేగవంతంగా చేయాల్సి ఉందని వివరించారు. ఇప్పటి కి భూసేకరణ పై ప్రజలు సహకరిస్తున్నట్లు. ఏండీ తెలియజేశారు.
హుస్సేన్ ఆలమ్ లో ఉన్న ఖుర్షీద్ రaా దేవిడి హెరిటేజ్ భవనం హెచ్‌ఎండిఏ నిధులతో కన్సర్వేషన్ రెస్టోరేషన్, మరమ్మత్తులు పనులను సిఎస్ పరిశీలించారు.
ఈ సందర్భంగా సిఎస్ నిర్వాహకులతో మాట్లాడుతూ… పార్కింగ్ అనువైన స్థలం ఉంది కాబట్టి హెరిటేజ్ భవనం మెయింటేనెన్స్ కోసం ఎగ్జిబిషన్ ఇతరత్ర వినూత్న ఈవెంట్స్ నిర్వహించి వచ్చిన నిధులతో హెరిటేజ్ భవనం నిర్వహణకు ఖర్చు చేసుకొనే వెసులుబాటు ఉంటుందని సూచన ఇచ్చారు. అక్కడ నుండీ ఫలక్నమా ఆర్.ఓ.బి పనులను పరిశీలించారు. జిహెచ్‌ఎంసి సంబంధించిన పనులు తుది దశలో ఉన్నాయని, రైల్వే పోర్షన్ పూర్తి చేసి సర్వీస్ రోడ్డుకు 5 ఆస్తులను సేకరణ పూర్తి చేసి నెలరోజుల్లో పూర్తి చేయడానికి చర్యలు తీసుకున్నట్టు ఏంఏయుడి సెక్రెటరీ ఇలంబర్తి, జిహెచ్‌ఎంసి కమిషనర్ సిఎస్ కు వివరించారు. ఆగస్టు వరకు పూర్తి చేయాలని సిఎస్ ఆదేశించారు. తప్పని సరిగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతుందని, రైల్వే పోర్షన్ పనులు మొదలుపెట్టిన నేపథ్యంలో ఆగస్టు చివరి వరకు పూర్తి చేయించడం జరుగుతుందని సిఎస్ కు వారు వివరించారు.

అక్కడి నుండి ఫలక్ నూమా ఫ్లై ఓవర్ నుండి నల్గొండ ఫ్లైఓవర్ పనులను పరిశీలిస్తూ మూసి నదిపై ముసారంభాగ్ వద్ద చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ బ్రిడ్జి నిర్మాణం వలన ప్రజలకు జరిగే ప్రయోజనాల గురించి వివరించారు. భూసేకరణ పప్రక్రియ గురించి సిఎస్ అడుగగా ఇంకా కొన్ని ఆస్తుల్ని చేయాల్సి ఉందని అధికారులు సిఎస్ కు వివరించారు. అక్కడ నుండి వాటర్ వర్క్స్ ద్వారా చేపట్టిన ఎస్.టి.పి పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని ఎండి ని ఆదేశించారు.
ఈ సందర్భంగా సి ఎస్ కే రామకృష్ణ రావు మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధి పై సీఎం రేవంత్ రెడ్డి గారు స్పెషల్ పోకస్ పెట్టారని అన్నారు.
సీఎం ఆదేశాల తో హైదరాబాద్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించామన్నార్రు
ఓల్డ్ సిటీ మెట్రో కు నిధుల కొరత లేదని ఓల్డ్ సిటీ మెట్రో కు ఆస్తుల సేకరణ త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్టు సిఎస్ తెలిపారు. జిహెచ్‌ఎంసి ఎస్ ఆర్ డి పి ద్వారా నిర్మిస్తున్న ఫ్లైఓవర్ ఇతర మౌలిక సదుపాయాల పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ముసారం బాగ్
బ్రిడ్జి పనులను పరిశీలించనున్నారు. అట్టి పనులు పూర్తి చేసి ప్రజల ఇబ్బందులు లేకుండా చేస్తానన్నారు. అంతే కాకుండా జలమండలి నిర్మస్తున్న %ూుూ% లు అన్ని అందుబాటులో కి తెస్తామన్నారు.
హైదరాబాద్ లో నిర్వహించే మిస్ వరల్డ్ పోటీను తెలంగాణ ప్రభుత్వం ప్రతిస్టాత్మకం గా తీసుకుందన్నారు. మిస్ వరల్డ్ పోటీలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సిఎస్ పేర్కొన్నారు.
టూరిజం శాఖతో అన్ని శాఖలు సమన్వయం చేసుకొని మిస్ వరల్డ్ పోటీలు విజయవంతం చేస్తామన్నారు..
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామ కృష్ణ రావు వెంట, ఎంఏయుడి సెక్రెటరీ కె.ఇలంబర్తి, హెచ్‌ఎండిఏ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్, జిహెచ్‌ఎంసి కమిషనర్ ఆర్.వి కర్ణన్, మెట్రో రైల్వే ఎండి ఎన్.వి.ఎస్ రెడ్డి, వాటర్ వర్క్స్ ఎం.డి అశోక్ రెడ్డి, జిహెచ్‌ఎంసీ ప్రాజెక్టు మెయింటేనెన్స్ సిఈ లు భాస్కర్ రెడ్డి, రత్నాకర్, కులీ కుత్బుషా అభివృద్ధి అథారిటీ అధికారులు, చార్మినార్, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్లు వెంకన్న, రవి కిరణ్, ప్రాజెక్ట్ ఈఈ రోహిణి, బి ఎల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.