తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో…
క్రికెట్ ఖేలో- నషా చోడో అనే నినాదంతో…
నో డ్రగ్స్ – నో బెట్టింగ్స్ అంటూ…
నాంపల్లి ప్రజాబలం ప్రతినిధి:ఎల్బీ స్టేడియంలో ఏప్రిల్ 27వ తేదీ నుండి నేటి వరకు టీ20 ఛాంపియన్ షిప్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించడం జరిగింది…
ఈ టోర్నమెంట్ కు ముఖ్య అతిథులుగా రాజ్యసభ ఎంపీ శ్రీ అనిల్ కుమార్ యాదవ్
బిసి ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నూతి శ్రీకాంత్ గౌడ్ హాజరై,
1) మొదటి బహుమతి క్రింద రూ, 5 లక్షల 55 వేయిల 555/-
2) రెండవ బహుమతి క్రింద రూ, 3 లక్షల 33 వేయిల 333/-
మరియు బెస్ట్ ప్లేయర్ కి ఎలక్ట్రిక్ స్కూటీ, బెస్ట్ బౌలర్ కి స్మార్ట్ టీవీ, మరియు ఇతర ప్లేయర్లకి మొదలగు బహుమతులు ఇవ్వడం జరిగింది…

ఈ సందర్భంగా జక్కిడి శివ చరణ్ రెడ్డి మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ అనే మహమ్మారి మరియు, బెట్టింగ్ యాప్స్ బారిన నేటి యువత పడకుండా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గట్టి ప్రయత్నం చేస్తుంది అన్నారు…
అదే స్ఫూర్తితో రాష్ట్ర యువజన కాంగ్రెస్ తరపున
నేటి యువత చెడు వ్యసనాలకు, బెట్టింగ్ లకు బానిసలు కాకుండా, యువతను మేలుకొలిపే దిశగా ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగిందన్నారు…
యువత బంగారు భవిష్యత్తుకై యువజన కాంగ్రెస్ తరపున ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపడతామని తెలిపారు…