ఖమ్మం ప్రతినిధి జనవరి 20 (ప్రజాబలం) ఖమ్మం కార్పొరేషన్ లోగల ఖానాపురం యస్.ఎస్.పి.కెనాల్ ఎం.ఎస్ కన్వెన్షన్ హల్ లో హోలీ స్పిరిట్ ఫెలో షిప్ వ్యవస్థాపకులు పసలపూడి రమేష్ ఆధ్వర్యంలో అద్భుతమైన బైబిల్ ఎగ్జామ్ నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దైవజనులు అబ్రహం , సత్యం , రాజన్న , సంజీవరావు , యెషయ్య లతో పాటు ఏసిపి ప్రసన్న కుమార్ , డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ , డాక్టర్ రాజశేఖర్ గౌడ్ లు పాల్గొన్నారు . అనంతరం గెలుపొందిన వారికి ప్రధమ , ద్వితీయ , తృతీయ బహుమతులను అందజేశారు . ఈ కార్యక్రమానికి సుమారుగా 150 మంది దాకా హాజరై విజయవంతం చేశారు .