ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం _ ప్రమాదాలను నివారిద్దాం

 

ఖమ్మంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో భారీర్యాలీ

ర్యాలీలో పాల్గొన్న ఆర్టీవో గౌస్ పాషా, ఎంవీఐ శంకర్ నాయక్, వరప్రసాద్

 

ఖమ్మం ప్రతినిధి జనవరి 20 (ప్రజాబలం) ఖమ్మం సమాజంలో ప్రతిఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి రోడ్డు ప్రమాదాలను నివారించాలని ఖమ్మం రోడ్డు రవాణా శాఖ అధికారి ఎండి గౌస్ పాషా పేర్కొన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాలు భాగంగా ఖమ్మంలోని రవాణా శాఖ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. అనంతరం ద్విచక్ర వాహనాలపై, కార్లలో వివిధ వాహనాల్లో వెళ్తున్న డ్రైవర్లకు అధికారులు గులాబీ పూలు ఇచ్చి క్షేమంగా వెళ్లాలని సూచిస్తున్నారు. రోడ్డుపై ప్రయాణాలు చేసేటప్పుడు కుటుంబసభ్యులను బాధ్యతలను గుర్తుంచుకోవాలని జాగ్రత్తగా నడపాలన్నారు. ఈ మాస ఉత్సవాలు ఫిబ్రవరి 14వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. మానవ తప్పిదాలు వల్లే అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయని, యువత రోడ్డు భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking