కరీంనగర్ ప్రజాబలం ప్రతినిధి జూలై 4
నీట్ పరీక్ష పేపర్ లీకేజి అవకతవకలపై గురువారం రోజున విద్యా సంస్థల బంధు ని విజయవంతం చేయడం జరిగింది ఇందులో. ఎన్ ఎస్ యు ఐ,ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ , పి డి ఎస్ యు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది. ఎన్ ఎస్ యు ఐ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి ఇమ్రాన్ మాట్లాడుతూ వెంటనే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి నీట్ పరీక్షలు అన్ని వెంటనే రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కోరడం జరిగింది. కేంద్రం దిగివచ్చి వెంటనే స్పందించకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉదృతం చేస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి ఇమ్రాన్ ఎన్ ఎస్ యు ఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి పల్నాటి అభిలాష్ ఎన్ ఎస్ యు ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేష్, ఎన్ ఎస్ యు ఐ I టౌన్ ప్రెసిడెంట్ వంశీ, ఏఐఎస్ఎఫ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు వెంకటేష్ , ఏఐఎస్ఎఫ్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి రత్నాకర్, ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు అభిలాష్, పి డి ఎస్ యు హుజురాబాద్ అసెంబ్లీ ప్రెసిడెంట్ వంశీ, సోహెల్, సోను ,సందీప్, శివ, రాజేష్, రంజిత్. తదితరులు పాల్గొన్నారు.