నిర్మల్ జిల్లా మామడ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేసిన బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..నిర్మల్ జిల్లా మామడ మండలం కొరిటికల్ గ్రామంలోగల ప్రభుత్వ పాఠశాలలో కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రేసింగ్ ఇండియా 13.50 లక్షల నిధుల ద్వారా అదనపు గదుల సైన్స్ ల్యాబ్) నిర్మాణానికి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి శంఖుస్థాపన చేశారు. విద్యార్థులు ఎమ్మెల్యే ను ఘన స్వాగతం పలికారు.అనంతరం మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తాను అన్నింటికంటే విద్యకే ముఖ్య ప్రాధాన్యత ఇస్తానని రాబోవు రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నిర్మల్ నియోజకవర్గంలో విద్యా రంగాన్ని బలోపేతం చేయడానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పాఠశాల ఉపాధ్యాయులు మహేశ్వర్ రెడ్డి ని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు.ఈ కార్యక్రమంలో డి ఈ ఓ,ఎం ఈ, ఎంపీడీవో. తో పాటు ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.