నీతి ఆయోగ్ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా కడెం మండలానికి పదవ స్థానం రావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..బుధవారం నిర్మల్ జిల్లా కడెం ఎం.పీ.డీ.వో కార్యాలయంలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పమలు పై నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్య, వైద్యం, వ్యవసాయం, పోషకాహారం, జలవనరులు,ఆర్థిక, నైపుణ్యాభివృద్ధి, మౌలిక సదుపాయాలు వంటి అంశాలలో నీతి ఆయోగ్ కింద దేశ వ్యాప్తంగా అభివృద్ధి పురోగతిపై సర్వే నిర్వహించడం జరిగిందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు జిల్లా లో వందశాతం అమలుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులకు, బాలింతలకు పోషకాహారం అందించాలని సూచించారు. నిర్మాణం లోనున్న అంగన్వాడీ కేంద్రాలను త్వరితగతిన పూర్తీ చేయాలనీ, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. పోషణ్ అభియాన్ లో అంగన్వాడీ లకు సంబంధించిన వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. ఏ.ఎన్.ఎం, ఆశా వర్కర్లను పూర్తి స్థాయిలో నియమించాలని, కడెం, పెంబి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రక్త హీనత, టీబీ, డయాబెటీస్ వంటి రోగులకు నాణ్యమైన చికిత్సలు అందించాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలలో అక్షరాస్యతా శాతం పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని, వంట గదులు, త్రాగునీరు, మరుగుదొడ్ల వంటి వసతులు కల్పించాలని సూచించారు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులపై ఉపాధ్యాయులకు శిక్షణలు అందించాలని సూచించారు. పశువులకు వంద శాతం వాక్సినేషన్ లు తప్పనిసరిగా వేయించాలని పశు సంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. అధికారులు సమన్వయము తో విధులు నిర్వర్తించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
ఈ సమావేశంలో డీ.ఆర్ డీ.వో విజయ లక్ష్మి, డీ.ఈ.వో రవీందర్ రెడ్డి, డీ.ఎం.ఎచ్.ఓ ధనరాజ్, డిపిఓ శ్రీనివాస్, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమాధికారి పీ.వై. రమేష్, డిటిడిఓ అంబాజీ, ఎల్.డి.ఎం చంద్రశేఖర్, ఎంపిడిఓ లు రమాకాంత్, అరుణ, ఇతర శాఖల అధికారులు, తదితరులు, పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking