వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి
వానాకాలం సాగుకు పంటకు బీమా
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 06 : రైతు సమస్యలు పరిష్కరించడానికే రైతు నేస్తం కార్యక్రమమును ప్రారంభిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోని రైతు వేదికలో ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిప్యూటి సీఎం బట్టి విక్రమార్క,వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సమీక్ష నిర్వహించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…రైతు సాగును లాభసాటి చేయడమే లక్ష్యంగా, సాగులో నూతన సాంకేతికను రైతులకు అందించనున్నామని అన్నారు.కొత్త వ్యూహలతో వ్యవసాయ అధికారులు, శాస్త్ర వేత్తలు మధ్య కమ్యూనికేషన్ కల్పిస్తామన్నారు.తద్వారా ప్రత్యక్ష, పరోక్షంగా జూమ్,యూట్యూబ్ లైవ్ ద్వారా క్షేత్ర స్థాయిలో మార్పులు చేపట్టవచ్చన్నారు.రైతులకోసం వచ్చే వానాకాలం నుండి పంట భీమా అమలు చేస్తామన్నారు. రైతుల తరపున భీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లెస్తుందన్నారు. మారుతున్న సామజిక పరిస్థితుల దృష్ట్యా నూతన టెక్నాలజీని రైతులకు పరిచయం చేస్తామన్నారు. అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి కల్పన మాట్లాడుతూ…రైతులకు నూతన సాంకేతికతపై సర్కారు అవగాహనను కల్పించనుందన్నారు. ఆవిష్కరణలు,విస్తరణ సేవల కోసం వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొచ్చిందని,రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్ ను అనుసంధానం చేసి రైతుల సమస్యలకు పరిష్కారాలు, సరికొత్త వ్యూహాలపై సర్కారు దృష్టి సారించిందన్నారు.ఖరీఫ్ నుంచి పంటల బీమా పథకాన్ని తిరిగి ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని, దానిని సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు.ఈ కార్యక్రమంలో ఏవో ప్రభాకర్,వివి