నేడు ఖమ్మం కు కేటీఆర్, నామ

పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న ఎంపీ నామ

ఖమ్మం ప్రతినిధి మార్చి 06 (ప్రజాబలం) ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గురువారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తో కలిసి ఖమ్మం నగరంలో విస్తృతంగా పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని ఎంపీ క్యాంప్ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఉదయం 10 గంటలకు మామిళ్ల గూడెంలోని వీవీసీ ఫంక్షన్ హాలులో ఖమ్మం పార్లమెంట్ కు సంబంధించిన ఏడు నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్తో కలిసి నామ పాల్గొంటారు.అలాగే సాయంత్రం 4.30 గంటలకు ఖమ్మం బైపాస్ రోడ్ లోని గాయత్రి గ్రౌండ్ లో జరిగే రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అభినందన , కృతజ్ఞత సభలోను, స్థానికంగా జరిగే పలు కార్యక్రమాల్లో నామ నాగేశ్వరరావు పాల్గొంటారు.ఈ కార్యక్రమాల్లో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర , బండి పార్థసారధి రెడ్డి, ఎమ్మెల్సీ, జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూధన్, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, అన్ని నియోజకవర్గాలకు చెందిన పార్టీ ప్రజాప్రతి నిధులు, నాయకులు కార్యకర్తలు హాజరయ్యే ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఎంపీ క్యాంప్ కార్యాలయం కోరింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking