ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..
నిర్మల్ లో
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి రాజకీయాలపై ఉన్న ప్రేమ, రైతులపై లేదు.
సర్కార్ కు ముందుచూపు లేకపోవడంతోనే పంటలు ఎండిపోయాయి.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా.. సాగు నీరు, విద్యుత్ సరఫరా విషయంలో నిర్లక్ష్యం చేశారు.
ఎన్నికల సమయంలో అన్నదాతలకు అబద్ధపు హామీలు ఆశ చూపి అధికారంలోకి వచ్చారు.
ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి అమలుకు నోచుకోలేదు.
రూ. 2 లక్షల రుణమాఫీ ఇవ్వలేదు.
పంటకు రూ. 500 బోనస్ ఇవ్వలేదు.
రూ. 15000 రైతు భరోసా సాయం ఇవ్వలేదు.
కౌలు రైతులకు రూ. 12000 సాయం ఇవ్వలేదు.
సాగు నీరు లేదు, సబ్సిడీలు లేవు.
ఇప్పుడు పంటలు ఎండిపోతే పరిహారం ఇచ్చే దిక్కు లేదు అని
బీజేఎల్పీ నేత
ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.
వెంటనే పంట నష్టపోయిన రైతులకు సాయం అందించాలి.
రైతులకు ఇచ్చిన హామీల విషయంలో అన్నదాతలకు క్షమాపణ చెప్పాలి.
దమ్ముంటే హామీలు అమలు చేశాకే లోక్ సభ ఎన్నికల ప్రచారానికి రావాలి.
లేకుంటే ముఖ్యమంత్రి, మంత్రులు, కాంగ్రెస్ నేతలను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తారు అని మహేశ్వర్ రెడ్డి అన్నారు