ఘనంగా బాబు జగ్జీవన్ రావ్ జయంతి వేడుకలు.

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి ఏప్రిల్ 5

జమ్మికుంట జడ్పిటిసి కార్యాలయంలో డాక్టర్. బాబు జగ్జీవన్ రాం జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి జమ్మికుంట జడ్పిటిసి డాక్టర్. శ్రీరామ్ శ్యామ్ పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్.శ్రీరాం శ్యామ్ మాట్లాడుతూ పేరొందిన స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త. రాజకీయవేత్త. బీహార్లోని వెనుకబడిన వర్గాలనుంచి వచ్చాడు. అతను బాబూజీగా ప్రసిద్ధుడు. భారత పార్లమెంటులో నలభై ఏళ్ళపాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉపప్రధానిగా వ్యవహరించాడు. 1935లో అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అనే సంస్థను స్థాపించడంలో అతను కీలక పాత్ర పోషించాడు.1937లో బీహార్ శాసనసభకు ఎన్నికయ్యాడు, ఆ తర్వాత గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్వహించాడు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపల్లి Ex ఉపసర్పంచ్ నిమ్మల శంకర్, నాయకులు పోడేటి అనిల్, అరవింద్, రవి ,మనోజ్, క్రాంతి నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking