తూప్రాన్, నవంబర్ 3 (ప్రజా బలం న్యూస్ ) :-
బిజెపి పార్టీ సీనియర్ నాయకుడు రామ్మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో ఈటెల రాజేందర్ సమీక్షలో చేరడం సంతోషంగా ఉందని తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం కార్యనిర్వహక ఉపాధ్యక్షులు సర్పంచ్ నత్తి మల్లేశం ముదిరాజ్, ఎంపీటీసీ లావణ్య ముదిరాజ్లతో పాటు పలువురు నాయకులతో శుక్రవారం నాడు చేరడం జరిగిందన్నారు. శనివారం నాడు బీసీ ముద్దుబిడ్డ బిజెపి నాయకుడు ఈటెల రాజేందర్ పర్యటన కాళ్ళకల్ బంగారమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించి భారీ ర్యాలీతో తూప్రాన్, మనోహరబాద్ మండలల కార్యకర్తలతో సమావేశం అయ్యి గ్రామాల్లో పర్యటిస్తూన్నట్లు మెదక్ బిజెపి పార్లమెంట్ కన్వీనర్ వర్గంటి రామ్మోహన్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం కార్యనిర్వహక ఉపాధ్యక్షులు సర్పంచ్ నత్తి మల్లేశం తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలోని పలు గ్రామాలలో బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ పర్యటనను విజయవంతం చేయడానికి బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మెదక్ పార్లమెంట్ కన్వీనర్ రామ్మోహన్ గౌడ్, కౌన్సిలర్ జమాల్పూర్ లక్ష్మీ బాయి నర్సోజి, గడ్డం రవీందర్, నత్తి మల్లేశంలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెవైయం జిల్లా ఉపాధ్యక్షుడు జానకి రామ్ గౌడ్, దలిత మోర్చ అధ్యక్షులు సంఖ్య యాదగిరి, మహేష్ యాదవ్, బిజెపి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.