లక్షెట్టిపేటలో నేను మోడీ కుటుంబం అని నిరసన కార్యక్రమం బీజేపీ నాయకులు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 11 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలో నేను మోదీ కుటుంబం అనే నిరసన కార్యక్రమం చేయడం జరిగింది,సోమవారం మోదీ కి కుటుంబం లేదని అవహేళన చేస్తు మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతృత్వంలోని ఐ.ఎన్.డి.ఐ.ఏ. కూటమి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే,లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు,నిరసనగా లక్షెట్టిపేట పట్టణం,లక్షెట్టిపేట మండలం కార్యకర్తలు కలిసి నిరసన తెలియజేయడం జరిగింది,ఈ కార్యక్రమంలో కార్యకర్తలు అందరూ మేము కూడా మోడీ కుటుంబం అని జవాబు చెప్పడం జరిగింది,ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు వీరమల్ల హరిగోపాలరావు,మండల అధ్యక్షుడు బొప్పు కిషన్, సీనియర్ నాయకులు రమేష్ జెన్,నరేష్ జైన్ ముస్కాన్ గంగన్న,కానగంటి మల్లయ్య,మోటపలుకులు సతీష్,ఎంబడి శ్రీనివాస్, కోమాకుల రవి,సమ రమణ, ముక్కెర చిన్నయ్య, రాజమౌళి,వేణుగోపాల్, లక్ష్మణ్,సుధాకర్,ఆనంద్, బాణాల రత్నం,రాకేష్,మేడి రవి,కోటగిరి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking