మహిళలు అన్ని రంగాల్లో రాణిoచాలి.

 

ఆహాఏమిరుచి రెస్టారెంట్ అధినేత సాంబశివరావు అధ్వర్యంలో ఘనoగా ఉమెన్స్ డే వేడుకలు

పలువురిని సత్కరించిన సినీనటి సుంకర శహరి, డిప్యూటి మేయర్ ఫాతిమా జోహారా, కార్పొరేటర్ జాన్ భీ

ఖమ్మం ప్రతినిధి మార్చి 10 (ప్రజాబలం) ఖమ్మం అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకొని ఖమ్మం నగరంలోని ఆహా ఏమి రుచి రెస్టారెంట్ ఆధ్వర్యంలో ఉమెన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.. ఈ సందర్భంగా ప్రముఖ సినీ నటి (స్కంద ఫేమ్ ) సుంకర శహరి, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, కార్పొరేటర్ జాన్ భి, నాగుల్ మీరా, సర్పంచ్ వరలక్ష్మి, ఖమ్మం SBI బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ కవిత, నాట్యకారిణి ఏలూరిమీనా, రెస్టారెంట్ అధినేత మత్తృమూర్తి సామ్రాజ్యం, రెస్టారెంట్ అధినేత సతీమణి నాగమణిలు ప్రసంగించారు.. ఈ యాంత్రిక యుగంలో పురుషులతో పాటు సమానంగా మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని, వారన్నారు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకు సముచిత ప్రాధాన్యత గుర్తింపు గౌరవం మరియు తమ గౌరవాన్ని గుర్తుచేస్తూ సత్కరించుకోవడం ఒక పండుగలాంటి వాతావరణంవారన్నారు… రెస్టారెంట్ అధినేత మాతృమూర్తి సామ్రాజ్యం మాట్లాడుతూ…తన పిల్లల ఎదుగుదలలోమరియు పిల్లల భవిష్యత్ కోసం పరితపించే మాలాంటి మాతృమూర్తుల శ్రమ అనన్యమని అమే అన్నారు.. మాలాంటి మాతృమూర్తులు తమ పిల్లలు ఉన్నత రంగాల్లో రాణిoచాలని కోరుకుంటారని అన్నారు. తొలుత కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.. అనంతరం సన్మాన గ్రహీతలకు శాలువాలతో జ్ఞాపికలతో ఘనoగా సత్కరించారు.. ఈకార్యక్రమంలో సన్ రైజ్ పిల్లల హాస్పిటల్ అధినేత కృష్ణ, రెస్టారెంట్ అధినేత తండ్రి పెనుగొండ లక్ష్మీనారాయణ, నలజాల రాజేష్ చౌదరి, జర్నలిస్ట్ ఈశ్వరి, నవాజ్ డ్రైవింగ్ స్కూల్ ఫర్హా, గ్రానైట్ సంస్థల అధినేత ఉదయలక్ష్మి, మoజుల, సౌందర్య, లలిత, మేనేజర్ కావ్య , నాజియ, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking