నిర్మల్ పట్టణంలోని జిఎన్ఆర్ కాలనీ వరదలతో నీట మునగడం వలన బిజెపి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కాలనీని సందర్శించిరు

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఈరోజు నిర్మల్ పట్టణంలోని జిఎన్ఆర్ కాలనీ వరదలతో నీట మునగడం వలన బిజెపి నాయకులు కాలనీని సందర్శించి పునరావాస సెంటర్ ఆల్ఫోర్స్ స్కూల్లో కాలనీవాసులను కలవడం జరిగింది. కాలనీ నీటి మునగడానికి గల కారణం సాకేర గ్రామ శివారులో గల చెక్ డ్యాం నిర్మాణం దానిని గతంలో బిజెపి నాయకులు సందర్శించినప్పుడు ఇచ్చిన హామీ అట్టి చెక్ డ్యాం యొక్క ఎత్తును తగ్గించడానికి నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారి చొరవతో అట్టి పనులకు నిధులు సాంక్షన్ కావడం జరిగింది.త్వరలోనే దాని ఎత్తును తగ్గించడానికి పనులు ప్రారంభమవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు అంజు కుమార్ రెడ్డి, పార్లమెంటు కన్వీనర్ అయ్యన్న గారి భూమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి సామ రాజేశ్వర్ రెడ్డి,అసెంబ్లీ కన్వీనర్ శ్రీగాదె విలాస్, స్టేట్ కౌన్సిల్ సభ్యులు అయ్యన్న గారి రాజేందర్,బీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు తోట సత్యనారాయణ బిజెపి నాయకులు కాలనీవాసులు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking