గంగాడి కృష్ణారెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ శ్రేణులు

 

కృష్ణారెడ్డి నాయకత్వంలో బీజేపీ బలోపేతం

ఎర్రబెల్లి సంపత్ రావు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు

హుజురాబాద్ ప్రజాబలం జనవరి 19

భారతీయ జనతాపార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడుగా 2వ సారి ఎన్నికైన సందర్భంగా ఈరోజు హుజురాబాద్ లో కృష్ణారెడ్డి నీ కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈసందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు మాట్లాడుతూ కృష్ణారెడ్డి చదువుకునే రోజుల్లో ABVP లో పూర్తిసమయ కార్యకర్తగా తమిళనాడులో పనిచేశారని, విద్యార్థుల సమస్యలపై అనేక ఉద్యమాలు చేశాడని కొనియాడారు.బీజేపీ లో నియోజక వర్గ కన్వీనర్ గా,జిల్లా కార్యదర్శిగా,జిల్లా ఉపాధ్యక్షుడుగా,పార్టీ పటిస్టకు కృషి చేసాడని,దానిని గుర్తించి 2020లో జిల్లా అధ్యక్షుడు గా అవకాశం కల్పించారని అన్నారు.అధ్యక్షుడుగా జిల్లా వ్యాప్తంగా తిరిగి బీజేపీ పార్టీని ప్రతి గ్రామానికి తీసుకెళ్లాడని కితాబిచ్చాడు.కృష్ణరెడ్డి నాయకత్వములో బిఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అనేక ఆందోళన కార్యక్రమాలు చేశాడని తెలిపారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం (కేంద్ర ప్రభుత్వం) ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు తీసుకెళ్లడం కోసం కృష్ణారెడ్డి కృషి చేశాడని, క్రమశిక్షణ, పోరాటపటిమను గుర్తించిన బీజేపీ రాష్ట్ర పార్టీ 2వ సారి జిల్లా అధ్యక్షుడిగా అవకాశం కల్పించారని, కృష్ణారెడ్డి నాయకత్వంలో బీజేపీ జిల్లాలో బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు,నియోజకవర్గ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి,జిల్లా కార్యదర్శి నర్సింహరాజు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పుప్పాల రఘు, జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్, వీణవంక మండల అధ్యక్షుడు రామిడి ఆదిరెడ్డి,హుజురాబాద్ పట్టణ అధ్యక్షుడు గంగిశెట్టి రాజు, పల్లపు రవి,భూపతి ప్రవీణ్, మోడెమ్ రాజు తదితులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking