సంగారెడ్డి తారా డిగ్రీ కళాశాలలో బోధనా, బోధనేతర సిబ్బందికి, ఎన్ సిసి విధ్యార్థులకు రోడ్డు భద్రత పై అవగాహన
సంగారెడ్డి జనవరి 19 ప్రజ బలం ప్రతినిది: జహీరాబాద్ టౌన్ లో రోడ్డు భద్రత లో కనీస అవగాహన కలిగి ఉంటే ప్రమాదాలు నివారించ వచ్చని మ్యాగ్మో వెల్ఫర్ సంస్థ నాసిక్ మరియు మహింద్ర లాజిస్టిక్ జహీరాబాద్ సమన్వయకర్త కె సంతోష్ కుమార్ తెలిపారు. మ్యాగ్మో వెల్ఫర్ సంస్థ నాసిక్ మరియు మహీంద్ర లాజిస్టిక్ ట్రైనింగ్ వారి ఆధ్వర్యంలో జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదాల నివారణ కు అవగాహన కల్పిస్తున్నారు. పాఠశాలలు, పరిశ్రమలు, హోటల్స్, జన సమూహం ఉన్న ప్రాంతాలలో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సంధర్భంగా ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను సూచిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు, జాతీయ రహదారి పై ప్రయాణ నిబంధనలు, వాహన చట్టాలు, వాహన అతి వేగం, మధ్యం, మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపడం పై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. జాతీయ రహదారి 65 తెలంగాణ సరిహద్దు నుండి హైదరాబాద్ వరకు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సంతోష్ కుమార్ తెలిపారు. సంగారెడ్డి తారా డిగ్రీ కళాశాల బోధనా, బోధనేతర సిబ్బందికి, ఎన్ సిసి విధ్యార్థులకు రోడ్డు భద్రత అవగాహన కల్పించామన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ సమన్వయకర్త కె సంతోష్ కుమార్, ఫిల్డ్ అధికారి ఆర్ అనీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.