బిజెపి సికింద్రాబాద్ శాసన సభ స్థానాన్ని మేకల సారంగాపానికి కేటాయించాలి

దండు లక్ష్మి ముదిరాజ్
హైదరాబాద్ ఆగష్టు 25:బారతీయ జనతా పార్టీ (బిజెపి) సికింద్రాబాద్ శాసన సభ (ఎంఎల్ఏ) స్థానాన్ని బిజెపి సీనియర్ నాయకుడు స్నీహ శీషి,సామాజిక వేత్త ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మేకల సారంగాపానికి కేటాయించాలని తెలంగాణా బిసి మహిళా ఐఖ్యవేదిక రాష్ట్ర అధ్యక్షురాలు దండు లక్ష్మి ముదిరాజ్ బిజెపి రాష్ట్ర అద్యక్షులు జి.కిషన్ రెడ్డి, రాజ్యసభ సబ్యులు డాక్టర్ .కే. లక్ష్మణ్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు విజ్ఞప్తి చేసారు. సారంగపాణి గత 10 సంవత్సరాలుగా బిజెపి పార్టీ క్రియాశీల సబ్యునుగా కొనసాగుతూ సికింద్రాబాద్ నియోజకవర్గం లో తనకంటూ గుర్తింపు పొందారని పేర్కొన్నారు. పేద బడుగు బలహీన వర్గాలకు ఎల్లవేలల అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. బిజెపి పార్టీ సికింద్రాబాద్ శాసన సభ (ఎంఎల్ఏ) స్థానాన్ని సారంగాపానికి ఇచినట్లయితే పార్టీ పరంగానే కాకుండా బిసి, ఎస్సి,ఎస్టి సామాజిక వర్గాలకు చెందినా ఓట్లు ఎక్కువగా పడుతాయని, తద్ద్వార సారంగాపాని గెలుపు సులబమవుతున్దన్నారు.ముక్యంగా బిఆర్ఎస్ పార్టీ బిసి లను అనగా ద్రొక్కే చర్యలకు పాల్పడుతుందని దండు లక్ష్మి ముదిరాజ్ విమర్శించారు.జనాబాలో అదిక శాతం జనాబా ఉన్న ముదిరాజ్ లకు బిఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు ఇవ్వకుండా మోసం చేసిందని అన్నారు.ఈ నేపద్యం లో ముదిరాజులందరూ ఏకం కావలసిన అవసరం ఉందన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking