ప్రజాబలం మంచిర్యాల జిల్లాలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో శుక్రవారం వరలక్ష్మి వ్రత పూజలను వేద పండితులు, పురోహితులు వినోద్ శర్మ ఆధ్వర్యంలో సామూహికంగా నిర్వహించారు.శ్రీ మహా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణమాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు ఉంటాయన్నారు. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకల అభిష్టాలు నెరవేరుతాయని,నిత్య సుమంగళీగా వర్ధిల్లుతామని నమ్ముతూ స్త్రీలు ఈ వ్రతాన్ని చేస్తారని తెలిపారు. తద్వారా అమ్మవారి కరుణాకటాక్షాలు పొందుతామని వారి నమ్మకమని పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్,పాఠశాల అధ్యక్షుడు నలుమాసు కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్,ఉప్పుల రామ్ కిషన్, ప్రధానాచార్యులు తొగరి పెంటయ్య,ఆచార్యులు, విద్యార్థులు,మపట్టణ పరిసర గ్రామాలలోని మాతృమూర్తులు పాల్గొన్నారు.