అదనపు కలెక్టర్ డి మధుసూదన్ నాయక్
ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 25 (ప్రజాబలం) ఖమ్మం శుక్రవారం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఐడిఓసి లో అధికారులు, సిబ్బంది చేపట్టిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొని, ఐడిఓసి ఆవరణలో కలుపు మొక్కలు, పిచ్చి మొక్కల తొలగింపు చేశారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి తన కార్యాలయంలో, వెలుపల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పని ప్రదేశాలు పరిశుభ్రంగా, పచ్చగా ఉంచడంతో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడి, పనిపై ఆసక్తి పెరుగుతుందని అన్నారు. మనం పనిచేసే ప్రదేశాలను మనమే పరిశుభ్రంగా ఉంచు కోవాలన్నారు మన ఇంటిని ఎలా పరిశుభ్రంగా ఉంచుకుంటామో, మనం ఎక్కువ సమయం వుండే కార్యాలయాన్ని అలాగే పరిశుభ్రంగా ఉంచాలన్నారు కార్యక్రమం లో ఐడిఓసి లోని జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.