ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 25 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన బెక్కం వినోద్ కు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు తీసివేయడంతో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుసుకుని శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతాప్ రావు రూ.2 వేలను బాధితునికి ఆర్ధిక సాయం చేశారు. అదే విధంగా పేరo రవీందర్ 25 కేజీల బియ్యం, రూ.1000 అందజేశారు. సూర్య ప్రసన్న 25 కేజీల బియ్యం అందజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు కందుల లింగన్న,వార్డు మెంబెర్ కోట సత్తయ్య, కాంగ్రెస్ నాయకులు రాయమల్లు,ప్రకాష్,బొల్లం వెంకట్,సర్పంచ్ శ్రీను కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.