బూత్ స్థాయి నుండి బీజేపీని పటిష్టం చెయ్యాలి

 

ప్రజాబలం ప్రతినిధి ఉప్పల్ డిసెంబర్ 23:సంస్థాగతంగా బలంగా ఉన్నప్పుడే ఎన్నికలలో మనం ఆశించిన ఫలితాలు వస్తాయని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ అన్నారు. బిజెపి సంస్థాగత ఎన్నికల లో భాగంగా నాచారం లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ శక్తి కేంద్రం ఇంచార్జి రాగిరి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో188,189,191 బూత్ అధ్యక్షులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా పాల్గొన్న ప్రభాకర్ కొత్తగా ఎన్నికైన అధ్యక్షులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు రాష్ట్రాలలో ఇవాళ బీజేపీ బలమైన శక్తిగా అవతరించడం వెనక బలమైన బూత్ ల నిర్మాణం ఉందని ఆయన గుర్తు చేశారు. బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమం లో డివిజన్ అధ్యక్షులు ప్రకాష్, డివిజన్ ఎన్నికల నిర్వహణ ఇంచార్జి చంద్రమౌళి, సీనియర్ నాయకులు వై సత్యనారాయణ, రాష్ట్ర గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి రవి నాయక్,జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు మల్లెల నర్సింగ్ రావు, గోపాల్ గౌడ్ బేక్కరి రవీందర్ రెడ్డి, కాటిపల్లి రవీందర్ రెడ్డి, అనిత రెడ్డి, వినోద రెడ్డి,నవీన్,యోగేశ్వర్ రెడ్డి,అంజి, రాజిరెడ్డి, ఉదయ్ కిరణ్,పాదం వెంకటేష్, మోర నరసింహ రెడ్డి, నవీన్ గౌడ్, వెంకటేష్ గౌడ్, శ్రీధర్ రెడ్డి, అమర్, బాలు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking