జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజని
ఖమ్మం ప్రతినిధి జనవరి 22 (ప్రజాబలం) ఖమ్మం రాహుల్ గాంధీ పాదయాత్ర ను అడ్డుకునే ప్రయత్నం చేసినకొంతమంది బీజేపీ కార్యకర్తలు అయినప్పటికీ రాహుల్ గాంధీ వారికి అభివాదం చేస్తూ తన పాదయాత్రను కొనసాగించారు రాహుల్ గాంధీ పాదయాత్ర కు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజనిఆరోపించారు గతంలో రాహుల్ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేసిన పాదయాత్ర విజయవంతం అయిందని ఇప్పుడు చేస్తున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర కూడా విజయవంతం గా పూర్తి చేసుకుంటారని ఆయన అన్నారు ఎన్ని అవాంతరాలు సృష్టించిన ప్రజలు రాహుల్ గాంధీకి అండగా ఉన్నారని అంజని అన్నారు