– ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
వీణవంక ప్రజాబలం జనవరి 22వీణవంక పోలీస్ స్టేషన్ ముందుగల రోడ్డును త్వరగా పూర్తి చేస్తామని దీనితోపాటు సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తన్న సమయంలో అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేస్తామని హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. సోమవారం వీణవంకలోని రోడ్డు పనులను అధికారులతో పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలోని ప్రజలు ఎవరు అధైర్యపడవద్దని తాను ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారమే ఒక్కొక్కటిగా అన్ని పనులు నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా వీణవంక రోడ్డును మొదటగా పూర్తి చేస్తానని ఇప్పటికే అధికారులతో పాటు ఎస్సారెస్పీ అధికారులతో కూడా మాట్లాడాలని వెంటనే రోడ్డు పూర్తి చేస్తామని అన్నారు. సమ్మక్క సారలమ్మ జాతర కోసం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు అధికారులతో చర్చించి జాతరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో ,ఎంపీడీఓ ,Si ,R&B ,మిషన్ భగీరథ మరియు పంచాయితీ రాజ్ అధికారులు పాల్గొన్నారు