రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి దే విజయం….

బిజెపి మహారాష్ట్ర ఎమ్మెల్యే పంకజ్ గోయల్

మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్:-

రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆశాభవాన్ని బిజెపి మహారాష్ట్ర వాళ్ద ఎమ్మెల్యే పంకజ్ గోయల్ పేర్కొన్నారు శుక్రవారం తూప్రాన్ మనోహరాబాద్ మండలాలకు చెందిన ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఎస్ఎఫ్ గార్డెన్ లో నిర్వహించారు యువత నిరుద్యోగులు పూర్తిగా అసంతృప్తితో ఉన్నారని రానున్న ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులు గెలిచి తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఆయన పేర్కొన్నారు కార్యకర్తలు ఇప్పటినుండి సైనికుడిలా పని చేసి ప్రతి నియోజకవర్గంలో విజయం సాధించేలా కృషి చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు అంతకుముందు తూప్రాన్ లో నరేంద్ర మోడీ 9 సంవత్సరాల చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల బుక్కులేట్లను పలువురు వ్యాపార సంస్థలకు విద్యావేత్తలకు అందజేశారు.. ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంటరీ కన్వీనర్ వర్గంటి రామ్మోహన్ గౌడ్, నందన్ గౌడ్ అసెంబ్లీ కన్వీనర్ సాయిబాబా, బిజెపి కౌన్సిలర్ జ మల్పూర్ నర్సోజి, సీనియర్ నాయకులు ఓబిసి మెంబర్ బండారు దుర్గరాజు యాదవ్, తాటి విట్టల్ మున్సిపల్ శాఖ అధ్యక్షులు రాముని గారి మహేష్ గౌడ్, జానకిరామ్ గౌడ్ సాయిబాబాగౌడ్, నరసింహారెడ్డి, గట్టు అమర్ సాయిబాబా యాదవ్, నాగరాజు, సిద్ధి రాములు, మహేష్ , శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking