–సంఘటన స్థలాన్ని సందర్శించిన ఈస్ట్ జోన్ డిసిపి సునీల్ దత్, కాచిగూడ ఏసిపి కస్తూరి శ్రీనివాస్
–రంగంలోకి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం బంధాలు
(అంబర్ పేట న్యూస్, గొల్నాక)
అంబర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని గోల్నాక జిందా తిరస్మత్ నగర్ రోడ్డులో ఒక భవనం మెట్లపై కనిపించిన రక్తపు మరకలు సంచలనం సృష్టించాయి. మెట్లు అన్నింటి పైన రక్తపు మరకలు ఉండడంతో ఏదైనా కొట్లాట జరిగిందా? లేక ఇంకేమన్నా అయిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈస్ట్ జోన్ డిసిపి సునీల్ దత్, కాచిగూడ ఏసిపి కస్తూరి శ్రీనివాస్, అంబర్ పేట ఇన్స్పెక్టర్ డి. అశోక్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ను రప్పించి పరిశీలన చేస్తున్నారు. రక్తపు మరకలు ఎలా వచ్చాయి అనేదానిపై దర్యాప్తు చేస్తున్నారు.
Prev Post
Next Post