రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 28-12-2023: పుప్పాలగుడ మణికొండ సకల జనహితం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు గావించిన ప్రజా పాలన కార్యక్రమం ఈ రోజు 28-12-2023 గురువారం మొదలైందని మొత్తంగా 8 ప్రభుత్వ పని రోజులపాటు శనివారం 06-01-2024 వరకు ప్రతి రోజు ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు 2:00 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు అధికారులు అందుబాటులో ఉండి 6 గ్యారంటీ అభయ హస్తం పతకాలైన మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, యువ వికాసం, చేయూతల అమలుకు అర్హత ఉన్నవారు ఇట్టి సదవకాశాన్ని ఉపయోగించుకొని దరఖాస్తులతో పాటు ఫొటో, ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు వగైరా క్రింద సూచించిన స్థలంలో అధికారికి అందించి మీ పేర్లను నమోదు చేసుకొని లబ్ధి పొందాలని కాంక్షిస్తూ సామాజిక ప్రజా అనుసంధాన కార్యకర్త వీ ఆర్ ఫర్ సహాయోగ్ చారిటబుల్ ట్రస్ట్ యొక్క ట్రస్టీ అందె లక్ష్మణ్ రావు తెలియ పరుస్తు ఈ కార్యక్రమంలో అభయ హస్తం పతకాల అధికారి లక్ష్మారెడ్డితో పాటు ట్రస్టీ దిలీప్ కక్కడ్, సెక్రెట్రియాటే కాలనీ కోశాధికారి మాధవరావు, మాజీ కార్యదర్శి రామకృష్ణ, అధికారిణిలు, ప్రజలు తది తరులు పాల్గొన్నారు.
వార్డ్ మరియు స్థలం అధికారి పేరు ఫోన్ నెంబర్
5 కృష్ణ సుశీల్ అపార్ట్మెంట్ శ్రీనివాస్. 9440482533
6 డాలర్ హిల్స్. లోకేష్. 8885849520
10 గణేష్ మండపం శ్రీమతి లక్ష్మి 8978521287
11 నెంలీనగర్. చంద్ర శేఖర్. 8639134138
12 డైమండ్ హిల్స్. నరసింహ రెడ్డి 9959083516
17 సెక్రెట్రియాటే కాలనీ. లక్ష్మారెడ్డి 8919067917
18 పుప్పాల్గుడ వార్డ్ ఆఫీస్ మల్లేశం 9676839634