స్పెషల్ సమ్మరి రివిజన్- 2024 పై రాజకీయ పార్టీలతో సమావేశం. —–జిల్లా అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు.

మెదక్ 27-12-2023,
ప్రజా బలం న్యూస్ :-

 

లోకసభ ఎన్నికల కసరత్తు లో బాగంగా బుదవారం కలెక్టర్ కార్యాలయం లోని కాన్ఫరెన్స్ హల్ లో స్పెషల్ సమ్మరీ రివిజన్ -2024 పై రాజకీయ పార్టీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టరు మాట్లాడుతూ నూతన పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు , జిల్లా లో జనాభా ప్రాతిపదికన పోలింగ్ కేంద్రాల పెంపు లాంటి అంశాల పై రాజకీయ పార్టీలు నాయకుల అభిప్రాయం పరిగణ లోకి తీసుకుంటామన్నారు.
స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024 ను రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాన్ని తెలుపాలన్నరు.
.
జనవరి 1 వ తేదీ నాటికి 18 సం : నిండిన వారందరినీ ఓటరుగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు.
జనవరి 5 వరకు నమోదు,6 న ముసాయిదా ఓటరు జాబితా విడుదల ,జనవరి 22 వరకు అభ్యంతరాల క్లైయీమ్స్ స్వీకరణ ,పిబ్రవరి 2 వ తేదీ లో గా క్లైయీమ్స్ పరిష్కారం పిబ్రవరి 8 న తుది జాబితా వెలువడుతుందన్నరు .
ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ బిజెపి , సిహెచ్ నర్సింలు కె.నర్సింహులు, బీఎస్పీ, అంజనేయులు గౌడ్ కాంగ్రెస్ ,
తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking