రాజన్న సిరిసిల్ల జిల్లా,
బోయిన్ పల్లి,
27 జూన్ 2024:
ప్రజాబలం ప్రతినిధి,
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ వైద్యులు , వైద్య సిబ్బంది సమయపాలన పాటించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. కలెక్టర్ గురువారం ఉదయం బోయిన్ పల్లి పి.హెచ్.సీ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా దవాఖానలో కేవలం ఆయుష్ డాక్టర్, ఫార్మసిస్ట్ట్ లు మాత్రమే హాజరు కావడం ఇతర వైద్యులు, సిబ్బంది ఎవరూ లేకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు.దవాఖాన లో వైద్యులు, సిబ్బంది ఎందరు ఉన్నారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ వైద్యులు , వైద్య సిబ్బంది ప్రతి రోజు సమయపాలన పాటిస్తూ సకలం లో ఆసుపత్రులకు హాజరై రోగులకు వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని,ఆసుపత్రులలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలోని పరిసరాలు పరిశీలించారు.