ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూన్ 27 : నస్పూర్ పురపాలక సంఘం అభివృద్ధి అధికారులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి మున్సిపల్ కమిషనర్ చిట్యాల స్తుతిస్తారు,మున్సిపల్ చైర్ పర్సన్ సురిమిళ్ళ వేణు తో కలిసి కార్యక్రమంలో వివిధ విభాగాలతో పాటు ప్రజాపాలన సేవ కేంద్రాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…మున్సిపల్ పరిధిలోని చేపట్టిన అభివృద్ధి పనులను అధికారులు సమయంలో త్వరితగతిన పూర్తి చేసేలా ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. వార్డులతో మిషన్ భగీరథ ద్వారా త్రాగునీటిని అందించడం పై ప్రత్యేక దృష్టి సారించాలని,విధి దీపారు నిర్వహణ పకడ్బందీగా ఉండెలా చూడాలని తెలిపారు. అంతర్గతంగా మురుగు కాలువలు అవగాహన కల్పించాలని తెలిపారు.ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమాన్ని సమర్థ వంతంగా నిర్వహించి దరఖాస్తు లను పూర్తి స్థాయిలో పరిశీలించి అర్హులైన లబ్ధిదారులకు పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రజాపాలన సేవ కేంద్రాన్ని వచ్చే దరఖాస్తు దారుల సందేహాలు నివృత్తి చేయాలని తెలిపారు.డంపింగ్ యార్డ్ ను సందర్శించి ప్రతి రోజు మున్సిపల్ పరిధిలోని ప్రతి ఇంటి నుండి తడి చెత్త,పోడిచెత్తను సేకరించి డంపింగ్ యార్డ్ ను సందర్శించి ప్రతి రోజు పరీక్షించాలని తెలిపారు.అనంతరం మున్సిపల్ పరిధిలోని నర్సరీని సందర్శించి యార్డ్ కు తరలించే విధంగా అధికారులు పర్యవేక్షించాలి తెలుపారు.అనంతరం మున్సిపల్ పరిధిలోని నర్సరీని సందర్శించి ముక్కలు నాటేందుకు నింపేందుకు నిర్ధారించిన లక్ష్యాలకు అనుగుణంగా ముక్కలను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.