ఖమ్మం ప్రతినిధి జూన్ 27 (ప్రజాబలం) కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామానికి చెందిన జక్కుల సైదులు- దేవకమ్మ ల మనవరాలు జక్కుల వెంకటనారాయణ- ఉమ శ్రీ ల కూతురు చి. మనస్విని కు పుష్పాలంకరణ వేడుక కార్యక్రమం ఫంక్షన్ హాల్ లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పాల్గొని చిన్నారి ని అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అక్కడకు విచ్చేసిన యాదవ కుల బంధువులును ఆప్యాయంగా పలకరించి న సందర్భంలో గొర్రెల స్కాం ప్రస్తావన గురించి మరియు కట్టిన డిడిల ప్రస్తావన గురించి మాట్లాడుతూ దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో వీటి పై విచారణ కొనసాగుతుందని, జిల్లాల రిపోర్టులు ఏసీబీ ఈడి శాఖలు పరిశీలిస్తున్నాయని, విచారణ తదనంతరం గొర్రెల స్కాంపై ఒక క్లారిటీ వస్తుందని,దీని వెనకాల ఉన్న అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులను కూడా విచారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. విచారణ అనంతరం కురుమ యాదవులకు రుణాల ప్రక్రియను ప్రభుత్వం వేరే తీరుగా ప్రకటించే అవకాశం ఉందని, ప్రస్తుతం డీడీల డబ్బులు తిరిగి తీసుకోవచ్చని వాటికి సంబంధించిన ఆధార్, పాస్ బుక్, డబ్బులు కట్టిన రసీదు, జిరాక్స్ మరియు దరఖాస్తును జిల్లా పశుసంవర్ధక శాఖ శాఖ కార్యాలయంలో ఇచ్చి నట్లయితే డబ్బులు మీ ఖాతాలో జమ చేయబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జక్కుల బ్రహ్మయ్య, మురారి నర్సయ్య, దేవరాజు, శీలం పుల్లయ్య పచ్చిపాల నరేష్, మార్గం లక్ష్మీనారాయణ, బుర్ర ముత్తయ్య రసాల మోహన్ రావు తదితర యాదవ బంధువులు పాల్గొన్నారు