బిఆర్ఎస్ పార్టీ గోశామహల్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రేమ్ సింగ్ రాథోడ్ కు బోయిని ఎల్లేష్ మాదిగ బహిరంగ లేఖ.
శ్రీయుత గౌరవనీయులైన ప్రేమ్ సింగ్ రాథోడ్ గారికి
బిఆర్ఎస్ పార్టీ గోశామహల్ నియోజకవర్గ ఇన్చార్జ్ గారు
ఆర్య విషయం : దళిత అనే పదాన్ని సుప్రీంకోర్టు నిషేధించింది ఈ పేరుతో చట్ట విరుద్ధంగా కార్యక్రమాలు చేస్తున్న గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం గురించి

తమరితో మనవి చేయునది ఏమనగా దళిత అనే పదం చాలా తీవ్రమైనది ఈ పదాన్ని సుప్రీంకోర్టు నిషేధించింది గోషమాహల్ నియోజకవర్గంలో షెడ్యూల్డ్ కులాల ప్రజలు ఎంతో గౌరవంగా జీవిస్తున్నారు వివిధ రంగాల్లో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నారు, షెడ్యూల్డ్ కులాల వాడలో దళిత బస పేరుతో గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు కార్యక్రమం చేస్తున్నారు దళిత అనే పదం షెడ్యూల్డ్ కులాల వారిని అవమానించే విధంగా, గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారికి దళిత అనే పదం తొలగించాలని “తేదీ.6/2/2023 న వాట్సప్ ద్వారా కోరినాము ఆయన గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు షెడ్యూల్డ్ కులాల వారి వాడలో దళిత అనే పదంతో కార్యక్రమాలు చేస్తున్నారు, దీనివల్ల మా ఆత్మగౌరవం దెబ్బతినేలా ఉంది, గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు అహంకారంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నట్టు అనిపిస్తుంది
కావున తమరు పై విషయాన్ని పరిశీలించి షెడ్యూల్డ్ కులాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతున్నాము
ఇట్లు
సామాజిక ఉద్యమ వందనాలతో
బోయిని ఎల్లేష్ మాదిగ