పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసమే ఉద్దీపన లక్ష్యం

ఉద్దీపన ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో

నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో

గౌరవ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు

నల్గొండ జిల్లా. నకిరేకల్ నియోజకవర్గం : నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారి సహకారంతో ఉద్దీపన ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమాని ఆదివారం రోజున నకిరేకల్ పట్టణంలోని కనకదుర్గమ్మ గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శాసనమండలి డిప్యూటీ మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్ గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గౌరవ మాజీ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని ప్రతి పేద విద్యార్థికి అండగా ఉండటమే ఉద్దీపన లక్ష్యం అని అన్నారు.. ఈ మెగా జాబ్ మేళా ద్వారా విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఆసరాగా నిలుస్తుంది. ప్రతీ పేద విద్యార్థుల యెక్క కలాల నేరవేర్చుటంలో ఉద్దీపన ఫౌండేషన్ అండగా ఉంటుందని తెలిపారు…

గత వారం రోజులుగా నుండి సుమారుగా 6 వేల పైచిలుగా అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా… నేడు నిర్వహించిన జాబ్ మేళాలో 1024 మంది ఎంపిక కాబడి నియామక పత్రాలను గౌరవ మాజీ MLA శ్రీ వేముల వీరేశం గారితో పాటు కంపెనీల ప్రతినిధుల ద్వారా వెంటనే నియామక పత్రాలు అందజేయడం జరిగింది. అంతేకాకుండా 1156 మందిని ఎంపిక చేయుటకు సిద్ధంగా ఉన్నారు అని తెలిపారు. యువతి, యువకులకు జాబ్ మేళా కు విచ్చేసిన ప్రతి ఒక్క నీరు ధన్యవాదాలు తెలిపారు.. భవిష్యత్తులో కూడ ఫౌండేషన్ ద్వారా మర్నిని అవకాశాలు కల్పిస్తామని తెలిపారు..

డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ గారు మాట్లాడుతూ వీరేశం గారు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా గొప్ప విషయం అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ గారు , రాష్ట్ర నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి గారు , బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పుజార్ల శంబయ్య గారు,
V3 ఛానెల్ చైర్మన్ కాసం సత్యనారాయణ గారు, కంపెనీల ప్రతినిధులు, ధృవ్ కన్సల్టెన్సీ మన్మోహన్, సత్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking