బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజల సౌకర్యార్థం సరిహద్దు బోర్డులు ఏర్పాటు

 

కూకట్పల్లి (ప్రజబలం) మార్చ్ 13:
బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ప్రజల సౌకర్యార్థం, స్థానికులకు పోలీస్ స్టేషన్ సరిహద్దుల గురించి అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో బాలానగర్ సిఐ నరసింహ రాజు పోలీసు స్టేషన్ అధికార పరిధిలను సూచించే బోర్డులను ఏర్పాటు చేశారు.
బాలానగర్ ఏసీపీ హనుమంతరావు చేతుల మీదుగా ఐడిపిఎల్ కూడలిలో ఈ బోర్డులను ప్రజల అవసరార్ధం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు రాంనారాయణ, సరళ, ఏఎస్ఐ ప్రభాకర్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ హనుమంతరావు మాట్లాడుతూ,ఈ బోర్డుల ఏర్పాటుతో ప్రజలకు తమ ప్రాంతం ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో తెలుస్తుంది. దీనివల్ల వారు తమ సమస్యలను సంబంధిత పోలీస్ స్టేషన్లో త్వరగా పరిష్కరించుకోవచ్చు” అని అన్నారు.

అనంతరం సిఐ నరసింహరాజు మాట్లాడుతూ,ప్రజలకు పోలీస్ స్టేషన్ పరిధి గురించి అవగాహన కల్పించడం చాలా ముఖ్యమన్నారు. దీనివల్ల నేరాలు తగ్గుతాయి ప్రజలకు పోలీసులకు మధ్య సంబంధాలు మెరుగుపడతాయి” అని పేర్కొన్నారు. ఈ బోర్డులపై పోలీస్ స్టేషన్ పరిధిలోని ముఖ్యమైన ప్రాంతాలు, వీధులు మరియు కూడళ్ల వివరాలతోపాటు పోలీస్ స్టేషన్, అధికారుల ఫోన్ నెంబర్లు సమకూర్చమన్నారు. ఈ బోర్డులు ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని స్థానికులు తెలిపారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు, వ్యాపారులు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking