భూకబ్జాలపై తాసిల్దార్ కు వినతిపత్రం

నవ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మ వెంకటేష్

హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి మార్చ్ 13

జమ్మికుంట పట్టణ కేంద్రంలోని తహసిల్దార్ కి వినతిపత్రం అందజేసిన నవ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మ వెంకటేష్ యాదవ్. ఈ సందర్భంగా అమ్మ వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ
జమ్మికుంట పట్టణ కేంద్రంలోని 647 సర్వే నెంబర్లో గల రెండు ఎకరాల స్థలాన్ని సుమారు 50 సంవత్సరాల క్రితం కృష్ణంరాజు సర్పంచ్ గా ఉన్నప్పుడు సర్పంచ్ తన పాలకవర్గం అప్పటి శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం స్కూల్ వ్యవస్థాపకులు అయినటువంటి కాంతారావు కి లీజ్ మీద స్థలం ఇవ్వడం జరిగింది.శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం స్కూలు వ్యవస్థాపక అధ్యక్షులు కాంతారావు మరణించగా ఆ స్కూల్ మూసి వేయడం జరిగింది.అప్పటికి నిరుపయోగంగా మారినటువంటి ఆ స్థలాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా గత ప్రభుత్వంలోని కొంతమంది అధికారులు,అధికార యంత్రాంగం ఆ స్థలాన్ని కబ్జా చేసి ఆ భూమిని ప్లాట్లు చేసి అమాయకులైనటువంటి ప్రజలకు అమ్మడం జరిగిందని అన్నారు. వాళ్లు నిర్మాణం చేపట్టే క్రమంలో విద్యార్థి సంఘాలుగా మున్సిపాలిటీకి కంప్లైంట్ చేసినప్పుడు ఇంటి నిర్మాణం పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకోవడం జరిగింది. ఆ స్థలాన్ని తిరిగి మళ్ళీ విక్రయాలు చేసి అమ్ముతున్నారు. 647 సర్వే నెంబర్లు గల భూమిని గత 20 సంవత్సరాల క్రితం ఎంత భూమి ఉండే ప్రస్తుతం ఎంత భూమి ఉన్నది,అలాగే 647 సర్వే నెంబర్లో కొంతమంది అక్రమ కబ్జాదారులు ధరణి పోర్టల్ లో వారి పేరు చూపెడుతుంది కానీ వారి తండ్రి పేరు గాని,జెండర్ పేరు గాని, ఈ కేవైసీ అప్డేట్ లేదని చూపెట్టడం గమనార్హం.దీని గురించి జమ్మికుంట తాసిల్దార్ కి వినతి పత్రం అందజేసి ఎంక్వయిరీ చేసి అక్రమ భూకబ్జా చేసిన కబ్జాదారుల పైన శాఖ పరమైనటువంటి కఠిన చర్యలు తీసుకుంటామని మండల రెవెన్యూ అధికారి తెలపడం జరిగిందని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking