ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ మార్చ్ 13 :
మందమర్రి ఏరియా వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 60వ క్రీడా వార్షికోత్సవంను గురువారం స్థానిక సి.ఈ.ఆర్ క్లబ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యాక్టింగ్ జనరల్ మేనేజర్ విజయ ప్రసాద్, ( ప్రెసిడెంట్ ఆఫ్ మందమర్రి ఏరియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి సంస్థ సి అండ్ ఎం.డి బలరాం ఆదేశాల మేరకు సింగరేణి ఉద్యోగులకు ప్రతి ఏటా క్రీడలను నిర్వహించడం జరుగుతుందని, ఈ పోటీలలో పాల్గొన్న క్రీడాకారులు కళాకారులు కోల్ ఇండియా స్థాయిలో ప్రతి సంవత్సరం ఎన్నో బహుమతులు సాధించి సింగరేణికి పేరు ప్రఖ్యాతలు తీసుకు వస్తున్నారని, సీనియర్ క్రీడాకారులు సంస్థలు పనిచేస్తున్న యువ ఉద్యోగులను క్రీడల వైపు ప్రోత్సహించాలని అన్నారు. ఈ క్రీడలు మానసిక ఉల్లాసానికే కాక శరీర దృఢత్వానికి తోడ్పడతాయని వారన్నారు. ఉద్యోగి ఆరోగ్యంగా ఉన్నప్పుడే సంస్థ అభివృద్ధికి దోహదం చేసిన వారు అవుతారని అన్నారు. అనంతరం మందమర్రి ఏరియా, కోల్ ఇండియా స్థాయిలో మెడల్స్ సాధించిన కళాకారులకు,క్రీడాకారులకు, సన్మానం చేసి బహుమతులు అందజేశారు. అదేవిధంగా డిపార్ట్మెంటల్ స్థాయిలో నిర్వహించిన క్రీడలలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో సలేంద్ర సత్యనారాయణ బ్రాంచ్ సెక్రటరీ ఎ.ఐ.టి.యు.సి మందమర్రి ఏరియా, రమేష్ సీ.ఎం.ఓ ఏ.ఐ ప్రెసిడెంట్ మందమర్రి ఏరియా, మైత్రేయ బందు డి.వై.పి.ఎం (చీఫ్ కోఆర్డినేటర్ మందమర్రి ఏరియా ), ఎం.కార్తీక్ (సీనియర్ పి.ఓ కేకే -5)క్రీడల గౌరవ కార్యదర్శి, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శివ, శాఖ శ్రీను జనరల్ కెప్టెన్ మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.