లోటస్ పాండ్ పాఠశాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

 

మెరుగైన విద్యను అందించడమే లోటస్ పాండ్ పాఠశాల లక్ష్యం

కరస్పాండెంట్, చైర్మన్ డాక్టర్ పుల్లూరి సంపత్ రావు

హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి మార్చి13:

జమ్మికుంట పట్టణంలోని లోటస్ పాండ్ పాఠశాలలో యుకేజి పూర్తి చేసుకున్న విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి పాఠశాల కరస్పాండెంట్, చైర్మన్ డాక్టర్ పుల్లూరి సంపత్ రావు ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్, చైర్మన్ డాక్టర్ పుల్లూరి సంపత్ రావు మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం నుండి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించుటకు లీడ్ ప్రొపెల్ ఎడ్యుకేషన్ సంస్థతో కలిసి విద్యాబోధన అందిస్తున్నట్లు తెలిపారు.. దీనిలో భాగంగా స్మార్ట్ క్లాస్, టీచర్ ట్యాబ్ తోపాటు పియర్శన్ పుస్తకాలు పుస్తకాలు ప్రవేశ పెడుతున్నామని, విద్యార్థులకు తరగతి గదిలో టీచర్ విద్యాబోధన తో పాటు ఆన్ లైన్ స్క్రీన్ ద్వారా సులభంగా విద్యార్థులకు అర్థం కావడానికి వీడియో ద్వారా చూపించడం జరుగుతుందని అన్నారు.. ఇప్పటికి వరకు పాఠశాల నిర్వహణకు సహకరిస్తున్న తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు.. భవిష్యత్ లో పాఠశాల నిర్వహణకు తల్లిదండ్రులు సహకరించాలని కోరారు.. ఆనంతరం యూకేజీ పూర్తి చేసుకున్న విద్యార్థులు సర్టిఫికెట్ల ప్రధానోత్సవంలో ఉత్సాహంగా పాల్గొని చైర్మన్ డాక్టర్ పుల్లూరి సంపత్ రావు చేతుల మీదుగా సర్టిఫికెట్ అందుకున్నారు.. అనంతరం విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు తల్లిదండ్రులను ఉపాధ్యాయులను అలరించాయి.. హార్ట్ ఫుల్ నెస్ యోగ సంస్థ వారిచే పాఠశాలలో 16వారాలు విద్యార్థులకు యోగ శిక్షణ ఇచ్చి సెర్టిఫికెట్ ని విద్యార్థులకు అందించారు. విద్యార్థులకు గిజుబాయ్ బుక్స్ సంస్థ వారిచే ప్లే వే పద్దతిలో విద్యను అందించి టీచర్లకు, విద్యార్థులకు సర్టిఫికెట్ అందజేశారు.. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking