విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 13 : ప్రభుత్వ పాఠశాలలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు విలువలు కలిగిన గుణాత్మక విద్యను అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయం,జూనియర్ కళాశాలను ఆకస్మికంగా సందర్శించి తరగతి గదులు,వంట శాల,హాజరు పట్టిక,పరిసరాలను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు నాణ్యమైన గుణాత్మక విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులకు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలకు సన్నద్ధం చేయాలని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన మెనూ ప్రకారం సకాలంలో విద్యార్థులకు పౌష్టికాహారం, శుద్ధమైన త్రాగునీటిని అందించాలని,విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని,వేసవికాలంలో వడదెబ్బకు గురి కాకుండా పాటించవలసిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది సమయపాలన పాటించాలని,విధుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు.అనంతరం తరగతి గదిలో విద్యార్థులు పఠనా సామర్థ్యాలను పరీక్షించి వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking