ప్రజల సామరస్య వాతావరణంలో హోలీ పండుగ జరుపుకోవాలి

 

– రాత్రి 10 గంటల వరకు బిర్యాని పాయింట్ మూసివేయాలీ

– ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు

జమ్మికుంట గుల్జార్ మసీదు దగ్గర ఉపవాస దీక్షలో ఉన్న పలువురు ముస్లింలతో సమావేశమైన సీఐ, హోలీ, రంజాన్ మాసంలో శుక్రవారం రేపు ఒకే రోజు రానున్న సందర్భంలో ప్రజలందరూ సౌబ్రాతృత్వంతో మెలగాలని, హోలీ అన్ని మతాలవారు జరుపుకుంటారు కావున అందరు కూడా వారి వారి అభీష్టం మేరకే హోలీ సంబరాల్లో పాల్గొనాలని, అన్య మతాల వారిపై బలవంతంగా రంగులు చల్లె ప్రయత్నం చేయవద్దని, ఎవరైనా అలా ప్రయత్నిస్తే వారినీ సున్నితంగా తెలపాలని అన్నారు. ఏవైనా ఘర్షణ వాతావరణం నెలకొంటే వెంటనే పోలీస్ వారికి సమాచారం అందించాలని అన్నారు. అలాగే హోలీ సందర్భంగా స్థానిక ప్రజలు మరియు బిర్యానీ పాయింట్ సెంటర్ వారితో మాట్లాడుతూ రాత్రి 10 గంటల వరకు బిర్యాని పాయింట్ మూసివేయాలని మరియు హోలీ రోజున వాహనాలపై ఇద్దరి కంటే ఎక్కువ వెళ్లకూడదని మరియు రోడ్లపై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండాలని, వాహనాలపై వెళ్లే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఉండాలని ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ప్రశాంత వాతావరణంలో వారి వారి ఇంటి వద్ద హోలీ సంబరాలు జరుపుకోవాలని సిఐ సూచించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking