రాజన్న సిరిసిల్ల జిల్లా, మార్చి -13
(ప్రజాబలం ప్రతినిధి)
రాజన్న సిరిసిల్ల జిల్లా లో ఈ నెల 15 వ తేదీ నుంచి జిల్లాలలో ఎంపిక చేసిన ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) ఏ.ఐ ను వినియోగిస్తూ సులభతరంగా విద్యాబోధన చేసేందుకు చర్యలు చేపట్టాలని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా అన్నారు.గురువారం హైదరాబాద్ నుంచి విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా , విద్యాశాఖ సంచాలకుల నరసింహారెడ్డి తో కలిసి ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ విద్యా బోధన పై జిల్లా కలెక్టర్లు విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా మాట్లాడుతూ, ఫిబ్రవరి నెలలో సర్కార్ బడిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగిస్తూ విద్యార్థులకు సులభతరంగా విద్య బోధన చేసేందుకు పైలెట్ ప్రాజెక్టు కింద 6 జిల్లాలో ప్రారంభించామని,ప్ అది మంచి ఫలితాలు ఇచ్చినందున రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని మార్చి 15 నుంచి ప్రారంభిస్తున్నామని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలో చదివే 3 నుంచి 5వ తరగతి విద్యార్థులకు కనీస విద్యా ప్రమాణాలు, అభ్యాస సామర్థ్యాలు పెంపొందించేందుకు ప్రతి జిల్లాలో కొన్ని ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. జిల్లాలో ముందస్తుగా ఎంపిక చేసిన పాఠశాలల్లో వెనుకబడిన విద్యార్థులకు ఏ.ఐ వినియోగిస్తూ సులభతరంగా విద్యా బోధన చేయాలని అన్నారు.ఏ.ఐ. కోర్సు ద్వారా విద్యార్థులకు బోధన చేసేందుకు వీలుగా ప్రతి పాఠశాలలో ఐదు కంప్యూటర్లు, అవసరమైన ఇంటర్నెట్ కనెక్షన్, హెడ్ ఫోన్స్ ఇతర సామాగ్రి అందుబాటులో ఉండేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ కార్యదర్శి సూచించారు.
జిల్లాలో ముందుగా ఎంపిక చేసిన పాఠశాలలో ఏ ఏ కోర్సు ద్వారా విద్య బోధన జరుగుతుందని, ఇక్కడ వచ్చే ఫలితాలను అంచనా వేస్తూ భవిష్యత్తులో దీన్ని మరింత విస్తరించి ఎందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు.అమ్మ ఆదర్శ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ లను ఉపయోగించి విద్యార్థులకు శిక్షణ ఇప్పించాలని పేర్కొన్నారు ముందుగా విద్యార్థులు తల్లిదండ్రులను పాఠశాలకు పిలిపించి వారితో వారికి ఎఫ్ఎల్ఎం తో వచ్చే ఫలితాలను వివరించాలని తెలిపారు. రానున్న రోజుల్లో అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేసి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు చదవడం రాయడం లో ఇలాంటి ఇబ్బంది పడకుండా చూడాలని ఉంది ప్రధాన ఉద్దేశం కంప్యూటర్లు ఇతర సామాగ్రి కోసం స్వచ్ఛంద సంస్థలను ఇతర సంస్థలను నుంచి సహాయం తీసుకోవచ్చు అని తెలిపారు అలాగే ఆయా జిల్లాల్లో అవసరమైన సామాగ్రి ఇతర పరికరాలు వివరాలను తమకు పంపించాలని సెక్రెటరీ విద్యాశాఖ సెక్రటరీ సూచించారు.