ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్. మల్కాజిగిరి జిల్లా జనవరి18:
సికింద్రాబాద్ నియోజకవర్గంలోని తార్నాక డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా బ్రహ్మాజీ ని నియమించడం జరిగినది.ఈ సందర్భంగా డిసిసి ప్రెసిడెంట్ అనిల్ కుమార్ యాదవ్ చేతులమీదుగా అపాయింట్మెంట్ లెటర్ తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రెసిడెంట్ పదవి రావడానికి కారణమైన ఆదం, సంతోష్ కుమార్ గారికి ( సికింద్రాబాద్ నియోజకవర్గం కంటెస్టెంట్ ఎమ్మెల్యే) మరియు అనిల్ కుమార్ యాదవ్ గారికి మరియు టిపిసిసి సెక్రెటరీ అమర్నాథ్ గౌడ్ కారికి కృతజ్ఞతలు తెలుపుతూ, డివిజన్లోని నాయకులు, కార్యకర్తలు, బూత్ స్థాయి కమిటీ మెంబర్స్ లను, కలుపుకొని పార్టీ పటిష్టత కొరకు పని చేస్తానని బ్రహ్మాజీ తెలిపారు.