ఖమ్మం పులిపాటి నగర్ 2లో తపాలా పోస్ట్ బాక్స్ సేవలు ప్రారంభం
డాక్టర్ పులిపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో సేవలపట్ల పలువురి హర్షం
పోస్ట్ బాక్స్ సేవలను ప్రారంభించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా తపాలాశాఖ సూపరింటెండెంట్ రవికుమార్
తపాలాశాఖ సేవలు విస్తృతమయ్యాయని, తపాలాశాఖ ఉమ్మడి ఖమ్మం జిల్లా సూపరింటెండెంట్ రవికుమార్ అన్నారు
ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 14 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కేంద్రంలోని గొల్లగూడ రోడ్డులోని మమత మెడికల్ కాలేజీ సమీపంలోగల పులిపాటి నగర్2 లో డాక్టర్ పులిపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో తపాల శాఖ నూతన పోస్ట్ బాక్స్ సేవలను ఆయన ప్రారంభించి మాట్లాడారు గత 30 సంవత్సరాల క్రితం గూగుల్ ఈ-మెయిల్ మరియు కంప్యూటర్ యుగం ఉండేది కాదని, ఆ రోజుల్లో పోస్ట్ కార్డు ఉత్తరాలు ఎంప్లాయిమెంట్ కార్డు కవర్లతో ప్రారంభమైన తపాలాశాఖ నేడు బ్యాంకింగ్ రంగంలో మరియు సేవింగ్స్ లో కూడా బ్యాంకింగ్ సెక్టార్ కు తీసిపోనీ విధంగా సేవలందిస్తూ వినియోదారుల మన్ననలు పొందుతూ వస్తున్న విషయం విధితమేనన్నారు ఈప్రాంత వాసులకు పోస్టల్ సేవలు విస్త్రుత పరిచేందుకు సామాజిక సేవకులు, పౌర సమితి అధ్యక్షులు, మహాత్మా గాంధీ ఫౌండేషన్ చైర్మన్, డాక్టర్ పులిపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో నూతన పోస్ట్ బాక్స్ సేవలు ప్రారంభించడo హర్షనీయమని ఉమ్మడి ఖమ్మం జిల్లా తపాలశాఖా సూపరింటెండెంట్ రవికుమార్ అన్నారు.. ఈసందర్భంగా డాక్టర్ పులిపాటి ప్రసాద్ ను ప్రత్యేకంగా అభినందించారు అనంతరం డాక్టర్ పులిపాటి ప్రసాద్ మాట్లాడుతూ తపాలాశాఖ సేవలను విస్తృత పరిచేందుకు మాప్రాంతంలో పులిపాటి నగర్ 2లో ఈకార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, తపాలశాఖ సూపరింటెండెంట్ రవికుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు తొలుత తపాలశాఖ ఉమ్మడి ఖమ్మం జిల్లా సూపరింటెండెంట్ రవికుమార్ కు స్వాగతం పలికి, శాలువాతో ఘనoగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపార ఈకార్యక్రమంలో వాసిరెడ్డి నాగేశ్వరరావు గుమ్మడివల్లి శ్రీనివాస్ గోల్ల రాధాకృష్ణమూర్తి, సిద్ధంశెట్టి శ్రీకాంత్, కోదుమూరి భద్రయ్య, మాసేటి వర ప్రసాద్ రావు, వెల్లంపల్లి వెంకటసుబ్బయ్య వైఎన్ రామ కృష్ణమూర్తి వంశీ, శ్రీనివాస్, ప్రవీణ్ కుమార్, పెనుగొండ సూర్యప్రకాష్ రావు, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు
