బీఆర్ఎస్ బిజెపిలు వికలాంగ ద్రోహులు

 

లోక్ సభ ఎన్నికల్లో వాటికి తగిన గుణపాఠం చెప్పాలి

వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య

రామ సహాయం రఘురామారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి

నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్

ఖమ్మం ప్రతినిధి మే 1 (ప్రజాబలం) ఖమ్మం బిజెపి బిఆర్ఎస్ లు వికలాంగ ద్రోహులని వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురామిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ జిల్లాలో నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్ తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వికలాంగులకి,వితంతువులకి, వృద్ధులకు, గీత కార్మికులకు మొట్ట మొదటిసారిగా పెన్షన్లను అందించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అని గుర్తు చేశారు. వికలాంగులకు విద్య ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమని అంతే కాకుండా వికలాంగులకు వితంతువులకు వృద్ధులకు 35 కేజీల అంత్యోదయ కార్డు ఇచ్చింది కాంగ్రెస్ అని తెలిపారు. వికలాంగుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ప్రత్యేకంగా లోక్ సభ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆరు అంశాలను వికలాంగుల కోసం ప్రకటించారని కాంగ్రెస్ ను గెలిపిస్తే ఆరు అంశాలు కచ్చితంగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు వికలాంగుల పై వివక్ష ను తొలగించడానికి ఆర్టికల్ 15, 16నీ సవరించి రాజ్యాంగ సవరణ ద్వారా అదనపు అంశాలు చేర్చి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఛత్తీస్ ఘడ్లో కాంగ్రెస్ స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఇచ్చిన మాదిరి దేశవ్యాప్తంగా వికలాంగుల కి రిజర్వేషన్లు ఇస్తామన్నారు బ్రెయిలీ స్క్రిప్ట్, సైన్ లాంగ్వేజ్ లను అధికారిక బాషాలుగా గుర్తిస్తామని తెలిపారు.వికలాంగుల హక్కుల చట్టం 2016 నీ సంపూర్ణంగా అమలు చేయడం జరుగుతుందని అన్నారు.ప్రైవేటు,ప్రభుత్వం భాగస్వామ్యంతో వికలాంగుల జీవన భద్రత & సంరక్షణ కి అనేక పథకాలు అమలు చేస్తామన్నారు అంగ వైకల్యం ఉన్న విద్యార్ధులకి మెరుగైన విద్యను,ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకి ప్రత్యేక విద్యను మెరుగు గా అందించడం కోసం రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లు సైతం ప్రారంభించి విద్యను మెరుగు పరుస్తామని తెలియజేశారు. 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి బిజెపి, బీఆర్ఎస్ లు వికలాంగులకు చేసింది ఏమీ లేదని అన్నారు. కెసిఆర్ ఏనాడు ముఖ్యమంత్రి హోదాలో ప్రపంచ వికలాంగుల దినోత్సవం హాజరు కాకుండా వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయకపోవడంతో మిత్రులు బొమ్మ కంటే మహేందర్ రావుల రామ్మోహన్ ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ని ఎత్తేసి శ్రీ శిశు సంక్షేమ శాఖల విలీనం చేసిన నీచపు చరిత్ర కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించి వికలాంగుల అభివృద్ధికి దోహదం చేయాలని ఆయన కోరారు. అనంతరం నగర్ కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ మాట్లాడుతూ…. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వికలాంగుల సంక్షేమానికి రాజకీయ ఎదుగుదలకు హక్కుల సంరక్షణకు దివ్యమైన ఔషధం అని తెలిపారు. పెరిక కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం గొప్ప నిర్ణయం అని అందుకే పెరికలకి మద్దతు కాంగ్రెస్ అని అన్నారు. బిజెపి ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు మొండి చేయి చూపిందని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వీరన్న విజయ సంకల్పయాత్ర-1 చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని, విజయ సంకల్ప యాత్రకు చేయడంతో దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం తధ్యమని దీమా వ్యక్తం చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం జిల్లా అధ్యక్షులు కుంచెం ఉప్పలయ్య జిల్లా కాంగ్రెస్ వికలాంగుల విభాగము వికలాంగుల మోటర్ వాహనాలతో భారీ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీని కార్పొరేషన్ చైర్మన్ వీరయ్యతో పాటు నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ కాంగ్రెస్ జెండా ఊపి ప్రారంభించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking