🔹తెలంగాణ ఉద్యమంలో కార్మిక వర్గం పాత్ర మరవలేనిది.
🔹సింగరేణి కార్మికులు కూడా తెలంగాణ ఉద్యమంలో తమ సత్తా చాటారు.
🔹సింగరేణి, ఆర్టీసీ కార్మికులు తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన ఉన్నారు.
🔹సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా అంటున్నాడు.
🔹కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయటం రేవంత్ రెడ్డి జేజమ్మ తో కూడా కాదు.
🔹కాళేశ్వరం ప్రాజెక్ట్, బీఆర్ అంబేడ్కర్ సచివాలయం, యాదాద్రి ఆలయం నిర్మాణంలో కార్మికుల శ్రమ ఉంది.
🔹కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలంటే తెలంగాణనే లేకుండా చేయాలె.
🔹ఉద్యమంలో కేసీఆర్ గారు బొంబాయి, దుబాయ్, బొగ్గు బాయి అని కార్మికులను ఉద్దేశించే అన్నారు.
🔹కార్మికుల విషయంలో కేసీఆర్ గారి హృదయం చాలా గొప్పది.
🔹కరోనా సమయంలో కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఎంతో ఇబ్బంది పడ్డారో మరిచిపోవద్దు.
🔹ఇదే మోడీ కాదా? కార్మికులను చావ గొట్టింది? కార్మికుల కోసం రైళ్లు పెట్టమంటే మానవత్వం లేకుండా చేసింది ఈ మోడీ కాదా?
🔹మళ్లీ సిగ్గు లేకుండా బీజేపోళ్లు అంటారు. మోడీ కారణంగానే మనం బతికి ఉన్నామంటా?
🔹మోడీయే వ్యాక్సిన్ కనుగొన్నాడు అని కిషన్ రెడ్డి అంటాడు.
🔹అసలు మనల్ని చావగొట్టనందుకే ఆయనకు ఓటు వేయాలంట.
🔹మోడీ దేవుడని ఇంకొడు అంటాడు. దేనికి దేవుడు?
🔹కార్మికులను, కర్షకులను చావ గొట్టిన్నందుకా? దేనికి మోడీ దేవుడు.
🔹ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు తగ్గితే ఎందుకు పెట్రోల్, డిజీల్ ధరలు పెరిగినయ్.
🔹రాష్ట్రాలకు వాటా ఇవ్వకుండా ఉండేందుకు ప్రత్యేక సెస్ లు వేసిండు.
🔹సెస్ ల పేరు చెప్పి ప్రజల తోలు పిండి వసూలు చేసింది రూ. 30 లక్షల కోట్లు.
🔹ఈ డబ్బులు ఏం చేసినవ్ అంటే జాతీయ రహదారులు కట్టినా అంటాడు. మరి టోల్ ఎందుకు వసూల్ చేస్తున్నావ్ అంటే చెప్పడు.
🔹ఈ 30 లక్షల కోట్ల రూపాయల నుంచి రూ. 14 లక్షల కోట్ల రూపాయలను అదానీ, అంబానీ లాంటి పెద్ద పారిశ్రామిక వేత్తలకు రుణ మాఫీ చేసిండు.
🔹నేను చెప్పింది అబద్దమైతే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.
🔹ఉచితాలు ఇస్తే అనుచితం అంటాడు మోడీ. కానీ బడా పారిశ్రామిక వేత్తలకు మాత్రం రుణమాఫీ చేస్తాడు.
🔹రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తా అంటే వద్దు అంటాడు. మొత్తం రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే లక్షా 50 వేల కోట్లు అవుతది.
🔹మోడీ కార్పొరేట్లకు చేసిన రుణమాఫీ డబ్బులతో పదేళ్లు దేశం మొత్తం రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వొచ్చు.
🔹కరోనా సమయంలో నాకు బాగా గుర్తు. కార్మికులను కేసీఆర్ గారు…నా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు అని అన్నారు.
🔹కరోనా కష్టకాలంలో ఒక్కో కార్మికునికి 5 వందలు ఇచ్చి, భోజనం పెట్టి…ఉచిత రైళ్లు ఏర్పాటు చేసి మంచితనాన్ని చాటుకున్నారు.
🔹పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్ఏలు, పంచాయితీ సెక్రటరీలు, సెర్ఫ్ ఉద్యోగాలు, హోంగార్డులు, సింగరేణి కార్మికులు, చేనేత, గీతా కార్మికులకు ఎంతో మేలు చేసింది. భారీగా జీతాలు పెంచింది.
🔹ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వం లో వీలినం చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా 73 శాతం జీతం పెంచారు.
🔹దేశంలో 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రమే వారికి బీడీ ఫించన్ ఇవ్వటం జరిగింది.
🔹కరెంట్ మంచిగ ఇవ్వటం కారణంగా కార్మికులకు మంచి ఉపాధి దొరికింది.
🔹రైతుల ఆదాయం డబుల్ చేస్తా అన్నాడు మోడీ. కానీ కాలేదు.
🔹అదే ఆయన దోస్త్ అదానీ ప్రపంచ కుబేరుల్లో 609 వ స్థానం నుంచి రెండో స్థానానికి చేరిండు.
🔹మహిళలకు, కార్మికులకు, రైతులకు ఒక్క పైసా పనిచేసినట్లు చెప్పే దమ్ము బీజేపోళ్లకు ఉందా?
🔹ఏమైనా అంటే జై శ్రీరాం. మనం యాదగిరి గుట్ట కట్టలేదా? రాజకీయాలను మతాన్ని వాడుకున్నామా?
🔹పదేళ్లు అధికారంలో ఉన్న చేసిన పని చెప్పుకోలేని దద్దమ్మలు బీజేపోళ్లు.
🔹చేనేత కార్మికులకు, బీడీ కార్మికులకు జీఎస్టీ వేసిన మొదటి ప్రభుత్వం బీజేపీ.
🔹రేవంత్ సర్కార్ కూడా వచ్చిన నాలుగు నెలల్లోనే చేనేత కార్మికులకు చీరల ఆర్డర్లు బంద్ పెట్టిన్రు. వాళ్లకు గత ప్రభుత్వం చేసిన మేలు మొత్తం లేకుండా చేశారు.
🔹మళ్లీ మా సిరిసిల్లలో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకునేలా చేసిండు.
🔹ఫ్రీ బస్సు తప్పుకాదు. కానీ దాని ఆధారంగా ఉపాధి కోల్పోయే ఆటోడ్రైవర్లకు మేలు చేయాలి కదా?
🔹ఈ ప్రభుత్వం వచ్చాక దాదాపు 50 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు.
🔹రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆటో డ్రైవర్లను రోడ్డున పడేశారు.
🔹నేను ప్రాతినిధ్యం వహించే సిరిసిల్లనే కార్మికుల అడ్డా. కచ్చితంగా కార్మికులకు నేను అండగా ఉంటాను.
🔹పార్టీ కార్మిక విభాగాన్ని నేనే చూసుకుంటా. భవిష్యత్ లో చాలా ఉద్యమాలు చేద్దాం.
🔹పార్లమెంట్ ఎన్నికల్లో సామాజిక న్యాయాన్ని పాటించింది బీఆర్ఎస్ మాత్రమే.
🔹మొత్తం 17 స్థానాల్లో ఐదు రిజర్వేషన్ స్థానాలు ఉన్నాయి. అందులో రెండు ఎస్టీలు, మూడు ఎస్సీలకు ఉన్నాయి.
🔹అందులో ఒకటి బంజారా బిడ్డకు, ఒకటి ఆదివాసి బిడ్డకు ఇచ్చాం.
🔹మూడు ఎస్సీ స్థానాల్లో కూడా సామాజిక న్యాయాన్ని పాటించాం.
🔹మొత్తం 12 స్థానాల్లో 50 శాతం సీట్లు బీసీలకు ఇచ్చాం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేమే ఎక్కువ మంది బీసీలకు సీట్లు ఇచ్చాం.
🔹ప్రభుత్వ రంగ సంస్థలు అడ్డికి పావుషేరుకు అమ్మవద్దంటే బీఆర్ఎస్ ఉండాలె.
🔹ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడే తెలంగాణను సాధించాం.
🔹మీరు 10-12 సీట్లు ఇస్తే మళ్లీ కేసీఆర్ గారు రాష్ట్రంలో రాజకీయాలను శాసించే పరిస్థితి ఉంటది.
🔹కార్మికులు, ఆటో డ్రైవర్లు గట్టిగా అనుకుంటే 12 సీట్లు రావటం కష్టం కాదు.
🔹హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేయవద్దంటే బీఆర్ఎస్ ఉండాలె.
🔹గోదావరి నీళ్లను మన అవసరాలు తీరకుండా మళ్లిస్తామంటే అడ్డుకోవటానికి బీఆర్ఎస్ ఉండాలె.
🔹రిజర్వేషన్లు, ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు కాకుండా ఉండాలంటే బీఆర్ఎస్ ఉండాలె.
🔹బీజేపీ గెలిస్తే సింగరేణి, మహారత్నాలు ఇలా అన్ని అమ్మేస్తాడు.
🔹కులాలు, మతం, జాతి పేరిట కొట్లాడుకుంటే మన దేశం ముందుకు పోము.
🔹వాటిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే సన్నాసులకు కచ్చితంగా బుద్ధి చెప్పాలె.
🔹అరచేతిలో వైకుంఠం చూపిన రేవంత్ రెడ్డి, పదేళ్లు మోసం చేసిన బడే భాయ్ కి బుద్ధి చెప్పాలె.
🔹మనం చేసిన పనులు చెప్పుకోలే. సోషల్ మీడియా లో ఎవడెవడో తప్పుడు ప్రచారం చేస్తే తలపాడు చేసుకున్నాం.
