బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనం

 

సమన్వయంతోపాటు మరింత బలోపేతమే లక్ష్యం.పార్టీ శ్రేణులందరినీ భాగస్వామ్యం చేసేలా కార్య‌చ‌ర‌ణ‌.
ప్రభుత్వ అభివృద్ధి- సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి.
బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజ‌యం సాధించేలా ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాలి.ఆత్మీయ స‌మ్మేళ‌నంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి,జిల్లా ఇంచార్జ్ గంగాధ‌ర్ గౌడ్.
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. గురువారము న‌ర్సాపూర్ మండల కేంద్రంలో అట‌వీ,ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌,దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి,బీఆర్ఎస్ జిల్లా ఇంచార్జీ గంగాధ‌ర్ గౌడ్, బీఆర్ఎస్ జిల్లా అధ్య‌క్షుడు విఠ‌ల్ రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠ‌ల్, బీఆర్ఎస్ నిర్మల్ జిల్లా ఇంచార్జ్ గంగాధ‌ర్ గౌడ్, బీఆర్ఎస్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు,ముధోల్ ఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే న‌ల్లా ఇంద్రకరణ్ రెడ్డి,జిల్లా రైతు స‌మ‌న్వ‌య స‌మితి అధ్య‌క్షులు న‌ల్లా వెంక‌ట్రామ్ రెడ్డి, జిల్లా గ్రంథాయ‌ల సంస్థ‌ల చైర్మ‌న్ ఎర్ర‌వోతు రాజేంద‌ర్, నిర్మ‌ల్ మున్సిప‌ల్ చైర్మ‌న్ గండ్ర‌త్ ఈశ్వ‌ర్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మ‌న్ ధ‌ర్మాజీ రాజేంద‌ర్, మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్లు చిలుక ర‌మ‌ణ‌, ఆశ్రిత రెడ్డి,జిల్లా అధికార ప్ర‌తినిధి ముడుసు స‌త్య‌నారాయ‌ణ‌, బీఆర్ఎస్ మండ‌ల క‌న్వీన‌ర్ రాజేశ్వ‌ర్, బీఆర్ఎస్ నాయకులు అల్లోల గౌతంరెడ్డి, అల్లోల సురేంద‌ర్ రెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking